Star Air flights : హైదరాబాద్ నుంచి జామ్‌నగర్‌కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం

తాజా వార్తలు

Updated : 01/09/2021 05:23 IST

Star Air flights : హైదరాబాద్ నుంచి జామ్‌నగర్‌కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్‌: జీఎంఆర్‌ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) హైదరాబాద్ నుంచి జామ్‌నగర్‌కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసును ప్రారంభించింది. ఉడాన్‌  (UDAN) కార్యక్రమంలో భాగంగా  టైర్ II, టైర్ III నగర ప్రయాణికులకు ఎయిర్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా ఈ సర్వీసులను ప్రారంభించారు. స్టార్ ఎయిర్ విమానం హైదరాబాద్  విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 3.20కి బయలుదేరి, సాయంత్రం 5.20 గంటలకు జామ్‌నగర్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జామ్‌నగర్ నుంచి ఉదయం 9.15 గంటలకు బయలుదేరి, 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్, జామ్‌నగర్ మధ్య వారానికి మూడు సార్లు (మంగళవారం, గురువారం, శనివారం) విమాన సర్వీసులు నడుస్తాయి. జ్యువెల్ ఆఫ్ కథియావర్ గా ప్రసిద్ధి చెందిన జామ్‌నగర్ శతాబ్దాల నాటి అద్భుతమైన రాజభవనాలు, అందమైన దేవాలయాలకు నిలయం. స్టార్ ఎయిర్ ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ సంజయ్ ఘోడావత్ గ్రూప్ విమానయాన విభాగం. స్టార్ ఎయిర్ భారతదేశమంతటా షెడ్యూల్డ్, అన్ షెడ్యూల్డ్ విమాన సేవలు అందిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని