నకిలీ ఓటర్లపై కఠిన చర్యలు: సీఈవో

తాజా వార్తలు

Updated : 17/04/2021 13:48 IST

నకిలీ ఓటర్లపై కఠిన చర్యలు: సీఈవో

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ అధికారులను ఆదేశించారు. నకిలీ ఓట్లపై ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పందించిన విజయానంద్‌  చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్‌ అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. సచివాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలింగ్‌ పరిస్థితిని సమీక్షించారు. దొంగ ఓట్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనీయొద్దని స్పష్టం చేశారు.

తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు రావడంతో తెదేపా నేతలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. తిరుపతిలో నకిలీ ఓటర్ల విషయంపై తెదేపా, భాజపా, కాంగ్రెస్‌ నేతలు ఉదయం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి: పనబాక లక్ష్మి

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో తిరుపతి నియోజకవర్గం 47వ డివిజన్‌, 219 పోలింగ్‌ బూత్‌లో దొంగ ఓటర్లను తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి స్వయంగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార పార్టీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకొని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రత్న ప్రభ ఆందోళన
తిరుపతిలో స్థానికేతరులు దొంగ ఓట్లు వేస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని తిరుపతి భాజపా ఎంపీ అభ్యర్థి రత్నప్రభ ఆరోపించారు. దొంగ ఓట్లను కట్టడి చేయాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతి పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని