అమరావతి భూములపై విచారణ వాయిదా

తాజా వార్తలు

Updated : 13/07/2021 14:18 IST

అమరావతి భూములపై విచారణ వాయిదా

దిల్లీ: అమరావతి భూములకు సంబంధించి సీఐడీ, సిట్‌ దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన ‘స్టే’ను ఎత్తి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ వాదనలు వినిపించారు. భూముల కొనుగోళ్లపై సీబీఐతో దర్యాప్తు చేయించినా అభ్యంతరం లేదని.. సిట్టింగ్‌ జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేయించినా సిద్ధమే అని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించామని వివరించారు.

ఈ వ్యవహారంపై ప్రస్తుత స్థాయిలో సుప్రీం కోర్టు విచారణ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. హైకోర్టులోనే పూర్తి స్థాయిలో విచారణ జరిగితే సరిపోతుందన్నారు. హైకోర్టులో కౌంటర్‌ వేసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతోనే సుప్రీంలో పిటిషన్‌ వేశామని తెలిపారు. విచారణ పూర్తి అయ్యే వరకూ ఎలాంటి చర్యలు చేపట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారు. అనంతరం పిటిషన్‌పై విచారణను ఈ నెల 22కు వాయిదా పడింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని