ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

తాజా వార్తలు

Updated : 10/02/2021 13:58 IST

ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

దిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మిషన్‌ బిల్డ్‌ ఏపీ అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. వివరాల్లోకి వెళితే...మిషన్‌ బిల్డ్‌ ఏపీ అంశంలో తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని, ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.

ఇవీ చదవండి..

పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడొచ్చు: హైకోర్టు

కందరాడలో బ్యాలెట్‌ పత్రాల అపహరణTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని