24 సార్లు గిన్నిస్ రికార్డు సాధించిన తైక్వాండో కోచ్

తాజా వార్తలు

Published : 10/08/2021 01:47 IST

24 సార్లు గిన్నిస్ రికార్డు సాధించిన తైక్వాండో కోచ్

ఇంటర్నెట్‌ డెస్క్‌: నైపుణ్యాల్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకునే ప్రతిభావంతులకు చక్కని వారధి గిన్నిస్ రికార్డ్. ఒక్కసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించటానికే కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు..! అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 సార్లు గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుని అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు తమిళనాడుకు చెందిన తైక్వాండో శిక్షకుడు.

యుద్ధ క్రీడలు అనగానే సాధారణంగా కుంగ్‌ఫూ, కరాటే వంటి ఆటలే గుర్తుకువస్తాయి. మన దేశంలో ఎంతో మంది తైక్వాండో క్రీడాకారులు ఉన్నా ఈ యుద్ధక్రీడకు రావాల్సి గుర్తింపు రాలేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు మదురైకి చెందిన తైక్వాండో క్రీడాకారుడు  ఈఎన్‌ నారాయణ ఈ క్రీడను అందరికీ చేరువ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే గిన్నిస్‌ రాకార్డులపై దృష్టి పెట్టారు. ఏకంగా 24 గిన్నిస్‌ రికార్డులు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

2016లో మొదటిసారిగా గిన్నిస్‌ రికార్డు సాధించిన నారాయణ గతేడాది కాళ్లకు 10 కిలోల బరువు కట్టుకుని నిమిషంలో 138 కిక్స్‌ చేసి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్నారు. ఇదే అత్యంత కఠినమైన రికార్డ్‌ అనుకుంటే ఆరునెలలపాటు శ్రమించి ఇటీవలే మరో రికార్డును బద్దలుకొట్టాడు నారాయణ. ఇలా ఇప్పటి వరకూ 24 గిన్నిస్‌ రికార్డుల్ని తనపేరిట లిఖించుకుని తైక్వాండో క్రీడకు మారు పేరుగా నిలుస్తున్నారు. 

 ఓ రికార్డు కోసం 30 సెకన్లలో 15 పుచ్చకాయలు పగలుకొట్టిన  నారాయణ అత్యంత కఠినమైన ఇటుకలు పగలకొట్టే విన్యాసాన్ని సైతం అవలీలగా చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. తైక్వాండో క్రీడకు గుర్తింపు తేవాలనే లక్ష్యం దిశగా విజయవంతంగా సాగుతున్న నారాయణ తన తాజా గిన్నిస్‌ రికార్డును ప్రధాని నరేంద్ర మోదీకి అంకితమిచ్చారు. వరుస గిన్నిస్‌ రికార్డులతో తైక్వాండోకు గుర్తింపు తీసుకొస్తూ క్రీడాభిమానుల అభినందనలు అందుకుంటున్నారు నారాయణ. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని