CBN: ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు సెల్యూట్‌

తాజా వార్తలు

Updated : 12/06/2021 13:52 IST

CBN: ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు సెల్యూట్‌

సోనూసూద్ సేవ‌ల‌ను కొనియాడిన తెదేపా అధినేత 

సేవ చేయ‌డం బాధ్య‌త‌గా భావిస్తున్నాన‌న్న‌ నటుడు

అమ‌రావ‌తి: కొవిడ్‌పై పోరాటంలో కుటుంబ సభ్యులు కూడా బాధితుల వ‌ద్ద‌కు వెళ్ల‌డం లేద‌ని.. ఇదే స‌మ‌యంలో క‌రోనా బారిన ప‌డిన‌వారికి సేవ‌లు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు సెల్యూట్ చేస్తున్న‌ట్లు తెదేపా అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవ‌ల‌పై వివిధ రంగాల నిపుణుల‌తో ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో విప‌త్తుల‌ను చూశాన‌ని.. క‌రోనా వంటి సంక్షోభం చూడ‌టం ఇదే తొలిసారి అని అన్నారు. ప్ర‌కృతి విప‌త్తు స‌మ‌యాల్లో ఎన్టీఆర్ ట్ర‌స్టు, తెదేపా అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌ని ఆయ‌న తెలిపారు. సేవ చేయ‌డానికి ప్ర‌భుత్వానికి ఎన్నో అధికారాలు, అవ‌కాశాలు ఉంటాయ‌ని.. మూడో ద‌శ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మ‌రింత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు అన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్ర‌జా సేవ త‌మ అజెండా అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. క‌రోనా విప‌త్తులోనూ టెలిమెడిసిన్ ద్వారా సాయం చేస్తున్న‌ట్లు వివరించారు.

సోనూసూద్ ఎంతో ఔదార్యం చూపారు: చంద్ర‌బాబు

స‌మావేశంలో పాల్గొన్న న‌టుడు సోనూసూద్ చేస్తున్న‌ సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు కొనియాడారు. క‌రోనా విప‌త్తులో సోనూసూద్ అపార సేవ‌లందించార‌న్నారు. వ‌లస కూలీల ప‌ట్ల ఎంతో ఔదార్యం చూపారని.. మ‌ద‌న‌ప‌ల్లెలో పేద కుటుంబానికి ట్రాక్ట‌ర్ అంద‌జేశార‌ని చెప్పారు. స‌మాజం ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు సేవ చేయ‌డం సోనూసూద్ బాధ్య‌త‌గా భావించార‌ని కొనియాడారు. ప్ర‌జాసేవ‌కు ఐక్య కార్యాచ‌ర‌ణ రూపొందిద్దామ‌ని చంద్ర‌బాబు సూచ‌న‌కు సోనూసూద్ అంగీక‌రించారు.

సోనూసూద్ మాట్లాడుతూ... విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం బాధ్య‌త‌గా భావిస్తున్నాన‌న్నారు. '' కొవిడ్ స‌మయంలో నాకు తోచిన సాయం అందిస్తున్నా. కొవిడ్ స‌మ‌యంలో చాలా మంది ప్ర‌జ‌లు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. హైద‌రాబాద్ అభివృద్ధిలో చంద్ర‌బాబు పాత్ర ప్ర‌త్య‌క్షంగా చూశా. కొవిడ్‌పై పోరులో ఇద్ద‌రి ఆలోచ‌న‌లు క‌ల‌వ‌డం ఎంతో సంతోషం. తెలుగు రాష్ట్రాలు నాకు రెండో ఇల్లు లాంటివి. నా భార్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వ్య‌క్తి కావ‌డం సంతోషం. సాయం కావాల‌ని అన్ని ప్రాంతాల నుంచి నాకు కాల్స్ వ‌స్తున్నాయి.

ప్ర‌జా సేవ‌కు స్పందించే ప్ర‌తి ఒక్క‌రూ నిజమైన హీరోలే..

సేవ చేయ‌డానికి కులం, మ‌తం, ప్రాంతం అవ‌స‌రం లేదు. సాయం కోరిన వారి ప‌ట్ల సేవ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా నిర్ణ‌యాలు తీసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో 18 ఆక్సిజ‌న్ ప్లాంట్ల నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకున్నాన‌ను. తొలిద‌శ‌లో క‌ర్నూలు, నెల్లూరు, హైద‌రాబాద్‌తో పాటు నాలుగు చోట్లు ఏర్పాటు చేస్తాం. ఇత‌ర రాష్ట్రాలు కూడా ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నాయి. ప్ర‌జా సేవ‌కు స్పందించే ప్ర‌తి ఒక్క‌రూ నిజమైన హీరోలే '' అని సోనూసూద్ అన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని