అక్కడ టీ ధర రూ.1000!

తాజా వార్తలు

Updated : 22/11/2020 05:35 IST

అక్కడ టీ ధర రూ.1000!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా ఓ టీ దుకాణంలో ఛాయ్‌ ధర ఎంత ఉంటుంది. సాధారణంగా రూ.5, 10 లేదా రూ.15 ఉంటుంది. కానీ బెంగాల్‌లోని నిర్జాస్‌ టీ దుకాణంలో మాత్రం రూ.1,000 వరకు ధర పలుకుతోంది. అక్కడ టీ తాగే వారికి ఆరోగ్య సంరక్షణ కూడా లభిస్తోంది. ఆ తేనీరు విశేషాలేంటో ఓసారి తెలుసుకుందాం.

రోజువారీ ఉద్యోగ జీవితంతో విసుగు చెందిన కోల్‌కతాకు చెందిన పార్థ గంగూలీ ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. తరచూ స్నేహితులతో ఆ అంశంపై చర్చిస్తూ వచ్చారు. మిత్రుల సలహా మేరకు వేర్వేరు రకాల తేనీరు అందించాలని నిర్ణయించారు. 2014లో ముకుంద్‌పూర్‌లోని రెండు ప్రైవేటు ఆసుపత్రులకు సమీపంలో నిర్జాస్‌ అనే టీ దుకాణం ప్రారంభించారు. నిర్జాస్‌ టీ దుకాణంలో తేనీరు ధర రూ.15 నుంచి రూ.1,000 వరకు ఉంది. ఇది టీ తయారు చేసే తేయాకు ఆధారంగా ఉంటుంది. గంగూలీ దుకాణంలో సుమారు 100 రకాల తేనీరు లభిస్తుంది. రుచులు కూడా అదే విధంగా ఉంటాయి. ఇక్కడ ఎన్ని రకాల టీలు ఉన్నా ప్రాచుర్యం కలిగిన తేనీరు మాత్రం మస్కటెల్‌ టీ. ఈ సుగంధ టీ రుచులను ఆస్వాదించేందుకు కోల్‌కతా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు. 

టీ దుకాణం ప్రారంభించడం వెనక అసలు ఉద్దేశం వేరే ఉందంటారు గంగూలీ. ఉపాధి కోసమే కాకుండా తేనీరుతోనే వినియోగదారులకు ఆరోగ్యం అందించాలని సంకల్పించినట్లు వివరించారు. టీ తాగడం వల్ల మానసికంగా ఉత్తేజం కలగడంతో పాటు ఆరోగ్య పరంగా మంచిదని తెలిపారు. త్వరలోనే తేనీరు ఆధారంగా చికిత్స అందించే టీ క్లినిక్‌ను ప్రారంభించనున్నట్లు గంగూలీ చెప్పారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని