KCR: ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డు పరిధిలో ఉంచాలి: సీఎం కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 25/09/2021 16:13 IST

KCR: ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డు పరిధిలో ఉంచాలి: సీఎం కేసీఆర్‌

కేంద్ర మంత్రి షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

న్యూదిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ .. కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్‌ జిల్లాకు జరుగుతున్న నష్టం, కృష్ణా జలాల అంశంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై చర్చించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, నీటి కేటాయింపులు జరపాలని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలుస్తోంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు తేదీ వాయిదాను మరోసారి షెకావత్‌ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా ఉన్న ప్రాజెక్టులనే నోటిఫికేషన్‌ పరిధిలోకి తీసుకురావాలని సీఎం కోరినట్టు తెలుస్తోంది. సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీకానున్న సీఎం కేసీఆర్‌.. ధాన్యం కొనుగోళ్లపై చర్చిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగే వామపక్షతీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని