కృష్ణా జలాలు: రిట్ పిటిషన్‌ ఉపసంహరణ

తాజా వార్తలు

Updated : 16/06/2021 22:24 IST

కృష్ణా జలాలు: రిట్ పిటిషన్‌ ఉపసంహరణ

హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర జలశక్తిమంత్రి హమీ మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పిటిషన్ ఉపసంహరించుకున్న నేపథ్యంలో నదీజలాల వివాదం సెక్షన్ 3 ప్రకారం వీలైనంత త్వరగా కృష్ణా జలాల విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసి పంపకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా రెండో ట్రైబ్యునల్‌కు తెలంగాణ పిటిషన్‌ను నివేదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని