AP News: ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి

తాజా వార్తలు

Updated : 26/08/2021 09:13 IST

AP News: ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి

వాల్మీకిపురం, కల్లూరు, న్యూస్‌టుడే: దేశాలు వేరైనా.. వారి ప్రేమ ఖండాలను దాటి పెళ్లితో ఒక్కటైంది. వివరాల్లోకి వెళితే.. పులిచెర్ల మండలం మరికుంటవారిపల్లె (కుమ్మరపల్లె)కు చెందిన చీమలమర్రి నారాయణకు ఇద్దరు కుమారులు. ఆయన వంటపని చేస్తూ ఇద్దరు కుమారులను చదివించారు.పెద్ద కుమారుడు భువన రంగయ్య(32) సెంట్రల్‌ అమెరికా మెక్సికోలో సోఫోస్‌ సొల్యూషన్స్‌లో ఐదేళ్లుగా అసోసియేట్‌ మేనేజర్‌గా, సౌత్‌ అమెరికా మెదిజిన్‌ ప్రాంతానికి చెందిన అమ్మాయి ఆనమరియా(29) కొలంబియాలోని ఎంప్లేఅమోస్‌ కంపెనీలో కమర్షియల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇరువురు ఉద్యోగరీత్యా దేశవిదేశాల పర్యటనలో భాగంగా పనామాలో జరిగిన స్నేహితుల పరిచయ కార్యక్రమంలో వారి తొలిచూపులు కలిశాయి. మూడేళ్లుగా వీరి మధ్య ప్రేమ కొనసాగుతోంది. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. హిందూ సంప్రదాయం ప్రకారం కుగ్రామంలోనే బుధవారం వారి వివాహం గ్రామస్థుల మధ్య జరిగింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని