Model: మద్యం సేవించి.. నడిరోడ్డుపై మోడల్‌ హల్‌చల్‌..

తాజా వార్తలు

Published : 11/09/2021 02:13 IST

Model: మద్యం సేవించి.. నడిరోడ్డుపై మోడల్‌ హల్‌చల్‌..

భోపాల్‌: అతిగా మద్యం సేవించిన ఓ మోడల్‌ గ్వాలియర్‌ నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించింది. మిలటరీ వాహనాన్ని ఆపి హంగామా సృష్టించింది. దిల్లీకి చెందిన 22 ఏళ్ల మోడల్‌ గురువారం రాత్రి సమయంలో మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చింది. వాహనాలకు అడ్డుపడుతూ వాహనదారులకు ఇబ్బంది కలిగించింది. రోడ్డుపై నిల్చుని గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మిలటరీ వాహనాన్ని ఆపి.. జీపుని కాలితో తన్నింది. ఆమె ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన ఓ జవాన్‌.. ఆమెకు నచ్చజెప్పి పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె జవాన్‌ను నెట్టివేసింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని