AP News: ఇంటింటికీ వెళ్లి అగ్రిగోల్డ్ బాధితులను గుర్తించాం: జగన్‌ 

తాజా వార్తలు

Updated : 24/08/2021 13:40 IST

AP News: ఇంటింటికీ వెళ్లి అగ్రిగోల్డ్ బాధితులను గుర్తించాం: జగన్‌ 

అమరావతి: లక్షల మంది ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి నష్టపోయారని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో రూ.666.84 కోట్లను ఆయన జమ చేశారు. అనంతరం జగన్‌ మాట్లాడారు. అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి పేదలు, చిన్న వ్యాపారులు మోసపోయారన్నారు. ఎవరూ నష్టపోకూడదని ఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించామని తెలిపారు.

10.4 లక్షల మందికి రూ.905.57 కోట్లు ఇచ్చాం

రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన 3.86 లక్షల మంది బాధితులకు రూ.207.61 కోట్లు, రూ.10వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన 3.14 లక్షల మంది బాధితులకు రూ.459.23 కోట్లు చెల్లించామని జగన్‌ అన్నారు. 2019 నవంబరులో మొదటి విడత కింద రూ.238 కోట్లు చెల్లించినట్లు వివరించారు. మొత్తం 10.4 లక్షల మందికి రూ.905.57 కోట్లు ఇచ్చామన్నారు.

గత ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వలేదు

‘‘కోర్టు కేసులు కొలిక్కి రాగానే అగ్రిగోల్డ్‌ భూములు, ఆస్తులు అమ్ముతాం. ప్రభుత్వ నగదు తీసుకొని మిగతా డబ్బును డిపాజిట్‌దారులకు అందిస్తాం. ప్రైవేటు సంస్థ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ప్రభుత్వం ఇస్తోంది. ఇలా ఆదుకున్న ఘటన దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. బాధితులకు రూ.785 కోట్లు చెల్లించాలని నిర్ధారించిన గత ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వలేదు’’ అని ఈ సందర్భంగా జగన్‌ విమర్శించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని