AP News: తిరుపతి పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌.. తెదేపా, వామపక్ష నేతల గృహనిర్బంధం!

తాజా వార్తలు

Updated : 11/10/2021 15:01 IST

AP News: తిరుపతి పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌.. తెదేపా, వామపక్ష నేతల గృహనిర్బంధం!

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తిరుపతి పర్యటనకు బయల్దేరారు.  గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన తిరుపతికి పయనమయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు తిరుపతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెదేపా, వామపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా వారిని నిర్బంధించినట్టు సమాచారం.

మరోవైపు, సీఎం రెండు రోజుల పర్యటన నేపథ్యంలో తిరుపతిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనతో నగరంలో స్వల్ప ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్టు తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. సోమవారం నుంచి మంగళవారం వరకు తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాలకు అనుమతిలేదని స్పష్టంచేశారు. ఈ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.45గంటల వరకు ఘాట్‌ రోడ్లలో ఎలాంటి వాహనాలను అనుమతించబోమన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని