ఏ పంచాయతీకి ఎంత చెల్లించారో చెప్పండి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

తాజా వార్తలు

Published : 04/08/2021 13:54 IST

ఏ పంచాయతీకి ఎంత చెల్లించారో చెప్పండి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుపై విచారణ

అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లుల చెల్లింపులో ఆలస్యంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని.. కోర్టు ఆదేశాల పట్ల గౌరవం లేదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇప్పటికే రూ.413 కోట్లు చెల్లించామని.. నాలుగు వారాల్లో మరో రూ.1,117 కోట్లు చెల్లించనున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం బిల్లులకు రూ.40కోట్లు మాత్రమే చెల్లించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఏ గ్రామపంచాయతీకి ఎంత చెల్లించారో వివరాలతో సహా పూర్తి అఫిడవిట్‌ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ బిల్లులపై విజిలెన్స్‌ విచారణలో ఏం తేలిందని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి జీకే ద్వివేదీని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన సమాధానం ఇవ్వకపోవడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత విషయాలు తెలుసుకోకుండా కోర్టుకు ఎలా వస్తారని ప్రశ్నించింది. ఈ కేసులో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎందుకు హాజరు కాలేదని.. హాజరు మినహాయింపు పిటిషన్‌లో కారణాలు ఎందుకు చెప్పలేదని నిలదీసింది. తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరవ్వాలని.. లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్ట్‌ 18కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని