శ్రీవారికి రూ.1.8 కోట్ల స్వర్ణనందకం విరాళం

తాజా వార్తలు

Updated : 19/07/2021 09:29 IST

శ్రీవారికి రూ.1.8 కోట్ల స్వర్ణనందకం విరాళం

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఎం.ఎస్‌.ప్రసాద్‌ రూ.1.8 కోట్ల విలువైన స్వర్ణ నందకాన్ని విరాళంగా అందజేశారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామిని దర్శించుకున్న ప్రసాద్‌ దంపతులు స్వర్ణ ఆభరణాన్ని బహూకరించారు. స్వర్ణ నందకం కోసం 6.5 కేజీల బంగారాన్ని వినియోగించినట్టు భక్తుడు తెలిపారు. ఈ సందర్భంగా దాతలను తితిదే అధికారులు అభినందించారు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసి.. తీర్థప్రసాదాలను అందించారు.

‘శ్రీవారికి అన్నమయ్య ద్వారా శ్రీ మహావిష్ణువు నందకాన్ని అందించిన తరహాలో ఓ స్వర్ణ నందకం తయారుచేయాలని సంకల్పించాం. అందులో భాగంగా ప్రస్తుతం స్వామికి ఉన్న ‘సూర్యకఠారి’ (ఖడ్గం) కొలతలతో స్వర్ణ నందకాన్ని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేయించాం’ అని ప్రసాద్‌ నిన్న మీడియాకు వివరించారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని