AP News: శ్రీవారి దర్శనం కల్పిస్తామని.. తితిదే ఛైర్మన్‌ పేరుతో దళారుల మోసం

తాజా వార్తలు

Updated : 23/09/2021 12:13 IST

AP News: శ్రీవారి దర్శనం కల్పిస్తామని.. తితిదే ఛైర్మన్‌ పేరుతో దళారుల మోసం

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని కొందరు దళారులు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేరు ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. సుపథం మార్గంలో దర్శనం కల్పిస్తామని భక్తులకు ఆశ కల్పించి మోసగిస్తున్నారు. తితిదే ఛైర్మన్‌ సిఫార్సు లేఖ ఇప్పిస్తామని చెప్పిన కొందరు దళారులు.. వైవీ సుబ్బారెడ్డి పేరుతో భక్తులకు మెసేజ్‌లు పంపారు. వారి నుంచి రూ.8 వేలు తీసుకొని ఈ మెసేజ్‌లు పంపినట్లు బాధితులు చెప్పారు.

ఈ మెసేజ్‌లతో భక్తులు ఛైర్మన్‌ కార్యాలయానికి వెళ్లగా.. అవి నకిలీ సిఫార్సులుగా తేలింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 11 టికెట్ల కోసం దళారులు రూ.16 వేలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని