Women Soldier Died in Kabul Blast: ఆ పసికందును లాలించిన ఆమె ఇక లేరు..

తాజా వార్తలు

Updated : 01/09/2021 04:14 IST

Women Soldier Died in Kabul Blast: ఆ పసికందును లాలించిన ఆమె ఇక లేరు..

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్నాళ్ల క్రితం అమెరికా  రక్షణ శాఖ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయింది. దానిలో ఓ సైనికురాలు అఫ్గాన్‌కు చెందిన ఓ పసికందును ఎత్తుకోని లాలిస్తుంటుంది. అదే  పోస్టు ఆ యువతి కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ‘నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను’ అని దానికి క్యాప్షన్‌ ఇచ్చింది. ఆ మహిళా సైనికురాలి పేరు సార్జెంట్‌ నికోల్‌ ఎల్‌ గీ. కాబుల్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అమెరికన్లను కదిలించింది. ఆమె మరణించడానికి కచ్చితంగా ఆరు రోజుల ముందు పోస్టు చేసిన ఫొటోను చూసి అమెరికన్లు చలించిపోతున్నారు.

నికోల్‌ భర్త కూడా కూడా మెరైన్‌గా పనిచేస్తున్నారు. నికోల్‌ సోదరి  మిస్టీ ఫ్యూకో దీనిపై స్పందించారు. తన సోదరే తనకు హీరో, బెస్ట్‌ ఫ్రెండ్‌ అని తెలిపారు. నికోల్‌ అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కోసం క్రౌడ్‌ ఫండింగ్‌ కార్యక్రమాన్ని ఆమె చేపట్టింది. కొన్ని రోజుల్లోనే 1,40,000 డాలర్లు చందాల రూపంలో వచ్చాయి. ఈ మొత్తాన్ని ఆమె అంత్యక్రియల నిమిత్తం వెచ్చిస్తామని మిస్టీ వెల్లడించింది. నికోల్‌ భౌతిక కాయాన్ని తెచ్చేందుకు అయ్యే ఖర్చులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో  పాల్గొని తుది వీడ్కోలు చెప్పేందుకు ఖర్చుల నిమిత్తం దీనిని వినియోగిస్తామని పేర్కొంది. 


 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని