AP News: అధికార పార్టీ ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తిన సీఐ

తాజా వార్తలు

Updated : 29/09/2021 13:24 IST

AP News: అధికార పార్టీ ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తిన సీఐ

గుత్తి: పోలీస్‌ యూనిఫాం ఒంటిపై ఉందన్న ధ్యాస లేకుండా ఫక్తు రాజకీయనాయకుడిలా వ్యవహరించారు ఓ పోలీసు అధికారి. అధికార పార్టీ కార్యకర్తలాగా ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారు. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి హాజరైన గుత్తి సీఐ రాము.. ఆహా.. ఓహో అంటూ ఎమ్మెల్యే పనితీరును ప్రశంసించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విధుల్లో ఉన్న సీఐ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని