Harsh Goenka: మనం మార్పును ఎందుకు వ్యతిరేకిస్తామో తెలుసా..?

తాజా వార్తలు

Published : 19/08/2021 23:29 IST

Harsh Goenka: మనం మార్పును ఎందుకు వ్యతిరేకిస్తామో తెలుసా..?

ముంబయి: కొత్త విషయాలు నేర్చుకోవడం, మార్పునకు ఆహ్వానం పలకడం, మనపై మనకు విశ్వాసం ఉండటం.. ఇలా పలు అంశాలపై జీవితానుభవాలను పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా. ThursdayThoughts (థర్స్‌డే థాట్స్‌) హ్యాష్‌ ట్యాగ్‌తో తాజాగా అలాంటి విషయమే ఒకటి చెప్పారు. మనమంతా మార్పును ఎందుకు ఆహ్వానించమో చెప్పి, సున్నితంగా మొట్టికాయ వేశారు. 

‘ ప్రజలు మార్పును ఎందుకు ప్రతిఘటిస్తారో తెలుసా..? మనం పొందేదాని కంటే కోల్పోయేదాని మీదే ఎక్కువ దృష్టి పెడతాం కాబట్టి’ అని గోయెంకా ట్వీట్ చేశారు. నెట్టిల్లు వేదికగా చెప్పిన ఆ మాటతో ఆయన్ను అనుసరిస్తోన్న వారు ఏకీభవించారు. ‘మార్పు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. కానీ ఒక్కసారి కనుక మార్పు వైపు వెళ్తే.. మరిన్ని నైపుణ్యాలను సంపాదించడమే కాకుండా కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధమవుతాం’, ‘దీనినే కంఫర్ట్‌ జోన్ అంటారు. మార్పునకు సిద్ధపడని వారు తమకు కేటాయించిన పనికి మాత్రమే పరిమితమవుతారు’ అంటూ నెటిజన్లు స్పందించారు. కొద్ది రోజుల క్రితం గోయెంకా ఈ తరహా ట్వీట్‌ ఒకటి చేశారు. అందులో ఆయన ప్రజలు ఓటమిని అంగీకరించడానికి గల కారణాలను విశ్లేషించారు. 

  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని