Coronavirus: ప్రభుత్వం స్పందించకపోతే మేమే జోక్యం చేసుకుంటాం: తెలంగాణ హైకోర్టు

తాజా వార్తలు

Updated : 15/09/2021 19:07 IST

Coronavirus: ప్రభుత్వం స్పందించకపోతే మేమే జోక్యం చేసుకుంటాం: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: మూడో దశ కరోనా పరిస్థితులను ఎదుర్కొనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సమర్పించకపోవడంతో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏసీజే జస్టిస్‌ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పాఠశాలలు పునఃప్రారంభమైనందున పిల్లలకు కరోనా సోకకుండా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించింది. జిల్లాల్లోనూ పిల్లల ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ మెరుగుపరచాలని ఆదేశించింది.

జులై 15న నిపుణుల కమిటీ సమావేశమై పలు సిఫార్సులు చేసిందని అడ్వొకేట్‌ జనరల్‌ న్యాయస్థానానికి తెలిపారు. నిపుణుల కమిటీ సిఫార్సుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ఏజీని ప్రశ్నించింది. ఈనెల 22 వరకు మూడో దశ కరోనా ప్రణాళికను ప్రభుత్వం సమర్పించాలని ఆదేశించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వం స్పందించక పోతే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని