AP News: తెదేపా సీనియర్ నేత కాట్రగడ్డ బాబు హఠాన్మరణం

తాజా వార్తలు

Updated : 23/10/2021 22:24 IST

AP News: తెదేపా సీనియర్ నేత కాట్రగడ్డ బాబు హఠాన్మరణం

విజయవాడ: కృష్ణాజిల్లాకు చెందిన తెదేపా సీనియర్‌ నేత కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు (బాబు) మృతిచెందారు. విజయవాడ లబ్బిపేటలోని ఆయన నివాసంలో ఈరోజు సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లాలో పార్టీనేతగా ఆయన వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. కాట్రగడ్డ బాబు మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాజ్యసభ సభ్యలు కనకమేడల రవీంద్రకుమార్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ ముందుండే వారని నేతలు కొనియాడారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని