Ts News: ఆ ప్రాజెక్టుల వివరాలు రేపట్లోగా ఇవ్వాలి: కేఆర్‌ఎంబీ సబ్‌కమిటీ

తాజా వార్తలు

Updated : 10/10/2021 22:08 IST

Ts News: ఆ ప్రాజెక్టుల వివరాలు రేపట్లోగా ఇవ్వాలి: కేఆర్‌ఎంబీ సబ్‌కమిటీ

హైదరాబాద్: బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలు, సమాచారాన్ని రేపటి లోగా అందించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సభ్యుడు రవికుమార్ పిళ్లై రెండు రాష్ట్రాల అధికారులకు స్పష్టం చేశారు. గెజిట్ అమలుపై పిళ్లై నేతృత్వంలోని కేఆర్ఎంబీ ఉపసంఘం హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. దశలవారీగా అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని.. ఇందులో భాగంగా మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి ప్రాజెక్టులు కానందున బనకచర్ల కాంప్లెక్స్, కృష్ణా డెల్టా సిస్టం మినహా మిగతా అన్ని ప్రాజెక్టులు, కేంద్రాల వివరాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ చెప్పినట్లు సమాచారం. దీంతో ఏపీకి చెందిన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల పరిధిలోని 22 కేంద్రాలు బోర్డు అధీనంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, శ్రీశైలానికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతల, ఆర్డీఎస్, తుమ్మిళ్ల సహా ఏడు కేంద్రాలు ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించినట్లు సమాచారం. శ్రీశైలం ఎడమగట్టును కూడా బోర్డు అధీనంలోకి తీసుకోవాలని ఏపీ కోరగా.. బోర్డు కూడా వివరాలు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే, తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, ఈ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నట్లు సమాచారం. పులిచింతల తరహాలోనే జూరాలను కూడా ఉమ్మడి ప్రాజెక్టుగా పరిగణించి బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరగా.. తెలంగాణ విభేదించినట్లు సమాచారం. 12వ తేదీన కేఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం ఉన్నందున రేపటిలోగా అన్ని వివరాలు అందించాలని రెండు రాష్ట్రాల అధికారులకు పిళ్లై సూచించారు. బోర్డు నిర్వహణ కోసం సీడ్ మనీ విషయమై కూడా ఉపసంఘం భేటీలో చర్చ జరిగింది. నిధుల అంశం ప్రభుత్వాల పరిశీలనలో ఉందని రెండు రాష్ట్రాల అధికారులు ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని