Ap News: అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు: బొత్స సత్యనారాయణ

తాజా వార్తలు

Updated : 22/07/2021 20:18 IST

Ap News: అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు: బొత్స సత్యనారాయణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్లతో బొత్స దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యల్లో వార్డు, సచివాలయ ఉద్యోగులను భాగస్వాములను చేయాలని కమిషనర్లను ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని