శాస్త్రీయ పద్ధతిలో మానవ వ్యర్థాల తరలింపు: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 17/07/2021 17:51 IST

శాస్త్రీయ పద్ధతిలో మానవ వ్యర్థాల తరలింపు: కేటీఆర్‌

హైదరాబాద్‌: చెరువులు, కాలువల్లోకి మానవ వ్యర్థాలు చేరకుండా చూడాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. డ్రైనేజ్‌లు, మానవ వ్యర్థాలను మనుషులతో తీయించకుండా చర్యలు తీసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. శాస్త్రీయ పద్ధతిలో మానవ వ్యర్థాలను తరలించే వాహనాలను హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. నాగరికమైన పద్ధతిలో ప్రజలు జీవించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 25 మున్సిపాలిటీల్లో 200 వరకు మినీ జెట్టింగ్ మిషన్లున్నాయన్నారు. నల్ల చెరువు వద్ద నిర్మించిన ఎఫ్‌ఎస్‌టీపీని మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన అవగాహన గోడ పత్రికను మంత్రి విడుదల చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని