Posani: పోసానిపై జనసేన ఫిర్యాదు.. న్యాయసలహా కోరిన పంజాగుట్ట పోలీసులు

తాజా వార్తలు

Published : 29/09/2021 12:28 IST

Posani: పోసానిపై జనసేన ఫిర్యాదు.. న్యాయసలహా కోరిన పంజాగుట్ట పోలీసులు

హైదరాబాద్‌: సినీనటుడు పోసాని కృష్ణ మురళిపై జనసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదు అంశంలో పంజాగుట్ట పోలీసులు న్యాయ సలహా (లీగల్‌ ఒపీనియన్‌) కోరారు. న్యాయ సలహా వచ్చాక ఫిర్యాదుపై నిర్ణయం తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.  

అసలేం జరిగిందంటే..

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి పోసాని కృష్ణ మురళి మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌ అతని అభిమానులతో తనను, తన కుటుంబ మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. అనంతరం జనసేన కార్యకర్తలు పోసానిపై దాడికి పాల్పడవచ్చనే సమాచారంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మీడియా సమావేశం ముగిశాక పోసానిపై జనసేన తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్‌ నేతృత్వంలో పలువురు దాడికి యత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు పోసాని వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు పోసాని కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన కార్యకర్తల ఫిర్యాదుపై పోలీసులు లీగల్‌ ఒపీనియన్‌ కోరారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని