AP News: గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద పవన్‌ అభిమానుల అడ్డగింత

తాజా వార్తలు

Updated : 29/09/2021 12:14 IST

AP News: గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద పవన్‌ అభిమానుల అడ్డగింత

గన్నవరం: గన్నవరం విమానాశ్రయం వద్ద జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు పవన్‌ గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. ఆయన ఎయిర్‌పోర్టు నుంచి మంగళగిరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు వద్ద పవన్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు తరలివచ్చారు. వారిని లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించి జాతీయ రహదారిపైనే అడ్డుకున్నారు. విమానాశ్రయం ఆవరణలో ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 

ఇటీవల నిర్వహించిన ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై పవన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు పవన్‌ వ్యాఖ్యలపై పలువురు ఏపీ మంత్రులు సైతం విమర్శలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తూర్పు ఏసీపీ విజయ్‌పాల్‌ నేతృత్వంలో ఎయిర్‌పోర్టు మార్గంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

గన్నవరం చేరుకున్న పవన్‌కల్యాణ్‌

పవన్‌కల్యాణ్‌ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను పటిష్ట భద్రత మధ్య ఎయిర్‌పోర్టు నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం తన వాహనంలో మంగళగిరి జనసేన కార్యాలయానికి పవన్‌ వెళ్లారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని