Ts News: తెలంగాణలో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు  

తాజా వార్తలు

Updated : 13/10/2021 21:14 IST

Ts News: తెలంగాణలో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు  

హైదరాబాద్: పోయి రావమ్మా.. పోయి రావమ్మా.. సద్దుల బతుకమ్మా, నా ముద్దుల బతుకమ్మా.. అంటూ పూల పండుగతో తెలంగాణ పులకిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. సద్దుల బతుకమ్మ సంబురాలతో రాష్ట్రంలోని ఊరు వాడా వర్ణరంజితమైంది. పువ్వులను దైవంగా భావించి పూజిస్తూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకొనే ఈ పూల జాతరను మహిళలు, యువతులు ఆడిపాడుతూ సంతోషంగా గడిపారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ పాల్గొని ఆడిపాడారు.

పూల పండుగ బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ,  పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఘనంగా జరుపుకోవడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ నేతలు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు బతుకమ్మ పండుగను సుఖశాంతులతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని  పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని