Vijayanagaram: బొబ్బిలి మున్సిపల్‌ పాఠశాలలో కరోనా కలకలం

తాజా వార్తలు

Updated : 25/08/2021 17:57 IST

Vijayanagaram: బొబ్బిలి మున్సిపల్‌ పాఠశాలలో కరోనా కలకలం

బొబ్బిలి రూరల్‌: విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా కలకలం రేగింది. బొబ్బిలి పరిధిలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పది మంది 4వ తరగతి విద్యార్థులు కొవిడ్‌ బారినపడినట్లు ఎంఈవో లక్ష్మణరావు తెలిపారు. పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉండగా.. ఏడుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పది మంది విద్యార్థులు వైరస్‌ బారినపడడంతో పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల మధ్యాహ్న భోజన సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు ఎంఈవో వెల్లడించారు. వారం రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విద్యార్థులందరి ఆరోగ్యాలు నిలకడగా ఉన్నాయని.. వారందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎంఈవో వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని