Tirumala Brahmotsavam: మోహినీ అవతారంలో అభయమిచ్చిన శ్రీనివాసుడు

తాజా వార్తలు

Updated : 11/10/2021 16:50 IST

Tirumala Brahmotsavam: మోహినీ అవతారంలో అభయమిచ్చిన శ్రీనివాసుడు

తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీవేంకటేశ్వరుడు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే దంతపు పల్లకిపై కృష్ణుడి రూపంలోనూ అభయమిచ్చారు. శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో ఈ వాహన సేవను నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి కర్పూర, పూర్ణకుంభ హారతులు సమర్పించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో ఆస్థానాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాయా జగత్తు నుంచి బయటపడేయటమే మోహినీ రూపం పరమార్థం అని భక్తులు విశ్వసిస్తారు. ఉత్సవాల్లో ప్రధాన వాహన సేవ అయిన గరుడ సేవను ఈ రోజు రాత్రి ఏడు గంటల నుంచి నిర్వహించనున్నారు. సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించి.. గరుడ సేవలో పాల్గొంటారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేష సాయి, మంత్రి అనిల్‌కుమార్‌, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, తెలంగాణ ఎమ్మెల్యే శంకర్‌నాయర్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని