AP News: పాడేరు ఐటీడీఏ వద్ద గిరిజన సంఘాల ఆందోళన ఉద్రిక్తం

తాజా వార్తలు

Updated : 22/10/2021 17:36 IST

AP News: పాడేరు ఐటీడీఏ వద్ద గిరిజన సంఘాల ఆందోళన ఉద్రిక్తం

పాడేరు: ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి గిరిజన ఉప కులాలను తొలగించడంపై విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ వద్ద గిరిజనులు ఆందోళనకు దిగారు. రెండు నెలల క్రితం వాల్మీకి, ప్రస్తుతం భగత, గౌడు తెగలు తొలగించడంపై ఆయా వర్గాలు ఆందోళనకు దిగాయి. గిరిజన సంఘం పిలుపు మేరకు వేలాదిమంది గిరిజనులు ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయం గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నప్పటికీ గేట్లు తోసుకుంటూ కార్యాలయం లోపలికి చొచ్చుకొచ్చారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి ఉప కులాలను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వచ్చి వెంటనే సమాధానం చెప్పాలని ఆందోళన కారులు కార్యాలయం వద్దే బైఠాయించారు. దాదాపు రెండు గంటలపాటు ఆందోళన కొనసాగింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని