TNGO: సీఎం కేసీఆర్‌ను కలిసిన టీఎన్జీవో ప్రతినిధి బృందం

తాజా వార్తలు

Published : 26/09/2021 21:33 IST

TNGO: సీఎం కేసీఆర్‌ను కలిసిన టీఎన్జీవో ప్రతినిధి బృందం

దిల్లీ: టీఎన్జీవో ప్రతినిధి బృందం దిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసింది. అనంతరం టీఎన్జీవో నేతలు మీడియాతో మాట్లాడుతూ... కొత్త ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ప్రకారం ఉద్యోగుల విభజనకు సీఎం ఆదేశించారని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు రూపొందించుకోవాలని సీఎం సూచించారని చెప్పారు. ఆదాయపన్ను రాయితీ పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎంను కోరినట్టు పేర్కొన్నారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆర్‌.ప్రతాప్‌, ముత్యాల సత్యనారాయణగౌడ్‌, చిలక నర్సింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ ఉద్యోగుల సంఘం నాయకులు, భాగ్యనగర్‌ టీఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ సభ్యులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. భాగ్యనగర్‌ టీఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని