TS High Court: కాకతీయ, తెలుగు యూనివర్సిటీ వీసీలకు హైకోర్టు నోటీసులు

తాజా వార్తలు

Updated : 04/08/2021 12:40 IST

TS High Court: కాకతీయ, తెలుగు యూనివర్సిటీ వీసీలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: కాకతీయ, తెలుగు యూనివర్సిటీ వీసీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీసీల నియామకంపై విశ్రాంత ప్రిన్సిపల్‌ విద్యాసాగర్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకం జరిగిందని.. కేయూ వీసీకి పదేళ్ల అనుభవం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. తెలుగు వర్సిటీ వీసీకి 70ఏళ్లు దాటాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్‌ తరఫు వాదనలు విన్న ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీని ఆదేశించింది. అనంతరం కాకతీయ వర్సిటీ వీసీ, రమేశ్‌, తెలుగు వర్సిటీ వీసీ కిషన్‌రావుకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 27కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని