Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

తాజా వార్తలు

Updated : 30/09/2021 16:59 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

1. అన్ని సామాజికవర్గాలను కలుపుకొని వెళ్లండి: జగన్‌

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై వైకాపా నేతలు, మంత్రులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్‌ సుధను పార్టీ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఉపఎన్నికకు వైకాపా తరఫున ఇన్‌ఛార్జ్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమిస్తున్నట్లు చెప్పారు. అతివిశ్వాసం వద్దు.. కష్టపడి ప్రజల ఆమోదం పొందాలని దిశానిర్దేశం చేశారు.

2. నేను పేదల గొంతుకను.. గెలిపించండి: ఈటల

ఉప ఎన్నికలో తెరాస గెలవలేదనే సీఎం కేసీఆర్‌ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌కు తాను లొంగిపోయినట్లు గతంలోనూ లేఖ సృష్టించారని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తేల్చలేదన్నారు. తాను పేదల గొంతుకనని.. హుజూరాబాద్‌లో గెలిపించాలని ప్రజల్ని కోరారు. 

3. పవన్‌తో సోము వీర్రాజు భేటీ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల నేతలూ సమావేశమయ్యారు. బద్వేలు ఉప ఎన్నిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అక్టోబర్‌ 2న శ్రమదానం వివరాలను జనసేన నేతలు సోము వీర్రాజుకు వివరించారు.

వచ్చే ఎన్నికల్లో పవన్‌ ఎన్నిచోట్ల పోటీచేస్తారో!: సుచరిత

4. జీవోలపై నూతన విధానం ఎందుకు?: ఏపీ హైకోర్టు

ఏపీలో జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో కాకుండా ఏపీ ఈ- గెజిట్‌లో ప్రభుత్వ ఉత్తర్వులను ఉంచుతామంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 100ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలపై నూతన విధానం ఎందుకు తీసుకొచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అక్టోబర్‌ 27వ తేదీలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

5. ప్రతి జిల్లాకు ఓ మెడికల్‌ కాలేజీ లక్ష్యంగా..!

దేశంలో ఆరోగ్య రంగాన్ని పూర్తిగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్‌ కాలేజీ లేదా పీజీ వైద్య విద్య కేంద్రం ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు వెల్లడించారు. రాజస్థాన్‌లోని నాలుగు జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలకు ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేశారు.    

6. సీఎంతో సిద్ధూ భేటీ.. ‘రాజీనామా’పై రాజీ కుదిరేనా..?

పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా రాజీనామా చేసిన కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్ సిద్ధూ.. గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీతో సమావేశమయ్యారు. చండీగఢ్‌లోని పంజాబ్‌ భవన్‌లో ఈ భేటీ జరుగుతోంది. కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కుల్జీత్‌ నగ్రా, సీనియర్‌ నేతలు పవన్ హోయెల్‌, ప్రగత్‌ సింగ్‌, హరీశ్‌ చౌదరీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిద్ధూ అనూహ్య రాజీనామాతో పంజాబ్‌ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభానికి పరిష్కారం దిశగా వీరిద్దరూ భేటీ అయ్యారు. 

7. కాంగ్రెస్‌లో ఉండను.. భాజపాలోనూ చేరను..!

పంజాబ్‌ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన భాజపాలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కెప్టెన్‌ అమరీందర్‌.. తాను భాజపాలో చేరడం లేదని వెల్లడించారు. అలాగని కాంగ్రెస్‌లోనూ కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

8. ట్రంప్‌నకు వెన్నుపోటు పొడిచిన ఆర్మీ జనరల్‌..!

ఓ అమెరికా జనరల్‌ దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్‌కు ఫోన్‌ చేసి ముందే చెప్పేశారు. కొన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చింది.. దీంతో యుద్ధాన్ని నివారించేందుకు అలా చేశానని ఇప్పుడా జనరల్‌ తాను చేసిన పని సమర్థించుకొంటున్నారు. అతనికి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ అండగా నిలుస్తున్నారు. తాజాగా ఆ జనరల్‌ అమెరికా కాంగ్రెస్‌ విచారణకు హాజరుకావడంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది. 

9. Poco C31: బడ్జెట్‌లో పోకో నుంచి కొత్త ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్ కోరుకునే వారి కోసం సీ31 పేరిట కొత్త మొబైల్‌ను పోకో భారత మార్కెట్లోకి గురువారం విడుదల చేసింది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే రెండురోజుల పాటు ఛార్జింగ్‌ వచ్చే బ్యాటరీ, ట్రిపుల్‌ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకతలు. పోకో సీ31 రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ వస్తోంది. 3జీబీ+32జీబీ వేరియంట్‌ ధరను కంపెనీ రూ.8,499గా నిర్ణయించింది. 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధరను రూ.9,499గా పేర్కొంది. 

10. హార్దిక్ పాండ్య టీ20 ప్రపంచకప్‌లో అలా ఆడాలి: వీరేంద్ర సెహ్వాగ్‌

రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. జట్టులో ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు. హార్దిక్ ఇప్పటికీ బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేడు.. కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో అతడు పూర్తిస్థాయి బ్యాటర్‌గా ఆడాలని చెప్పాడు. పాండ్య తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థుడని పేర్కొన్నాడు.

చెన్నై జోరుకు హైదరాబాద్‌ అడ్డుకట్ట వేస్తుందా?


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని