బిర్యానీ కోసం ఏడువు..వారి కోసం వద్దు!!

తాజా వార్తలు

Published : 17/09/2020 23:03 IST

బిర్యానీ కోసం ఏడువు..వారి కోసం వద్దు!!

కుమార్తె పుట్టిన రోజున తండ్రి సూచన

దిల్లీ: తల్లిదండ్రులు ఎప్పుడు తమ పిల్లలు సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. ఏ కారణంగానైనా వారు ఏడుస్తుంటే, ఆ బాధను దూరం చేయడానికి తమకు సాధ్యమైనంత చేస్తుంటారు. సంతోషంగా గడపాల్సిన పుట్టినరోజున తన కుమార్తె ఏడుస్తుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆమెకు సర్దిచెప్పడంతో పాటు నవ్వు తెప్పించే మాటలతో ఆమెను ఓదార్చుతూ, వాస్తవాలను కళ్లకు కట్టారు. రూపాశ్రీ అనే నెటిజన్ తన తండ్రి సందేశాన్ని నెట్టింట్లో షేర్ చేయడంతో వారి అనుబంధం వెలుగులోకి వచ్చింది. అదేంటో మనమూ చదువుదామా!

‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మనూ బేటా. ఈ రోజు ఉదయం నువ్వు ఏడవడం చూశాను. అర్హత లేని వ్యక్తుల కోసం కన్నీరు వృథా చేయొద్దని నీకు చెప్పాలనుకుంటున్నాను. నీకు 21 సంవత్సరాలు. నీ బలమేంటో నువ్వు తెలుసుకోవాలి. మన చుట్టూ చాలామంది వస్తుంటారు, పోతుంటారు. దాన్ని మాత్రం నువ్వు మార్చుకోవద్దు. నీ బలం తెలుసుకొని, నీ గురించే ఆలోచించుకో. వారి కోసం ఏడవడం కంటే బిర్యానీ కోసం ఏడవడం చాలా బెటర్‌. కానీ, నువ్వు నీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. నువ్వు రోజురోజుకూ గున్న ఏనుగులా మారుతున్నావు. మనస్సు శాంతిగా ఉండాలంటే రోజూ హనుమాన్‌ చాలీసాను పఠించు. ఇంకోసారి నిన్ను ఎవరైనా వేధిస్తే, వారి ఎముకలు విరిచి, మన ఆసుపత్రిలో చేర్చు’ అంటూ ధైర్యాన్ని నూరిపోశాడు. 

కాగా, ఆ నెటిజన్‌ ఈ మాటలను షేర్ చేయగానే నెట్టింట్లో పెద్ద ఎత్తున లైక్స్‌ వచ్చాయి. వారి ప్రేమపై కామెంట్ల వర్షం కురిసింది. అలాగే తమ తండ్రి కూడా ఇలాగే చెప్తుంటారని కొందరు పేర్కొన్నారు. మరికొందరు నువ్వు చాలా అదృష్టవంతురాలివంటూ సంతోషం వ్యక్తం చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని