అరె! అచ్చుగుద్దినట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ మాదిరిగా ఉన్నాడే!

తాజా వార్తలు

Published : 15/10/2021 01:47 IST

అరె! అచ్చుగుద్దినట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ మాదిరిగా ఉన్నాడే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏంటీ.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒక్కసారిగా ఇలా రోడ్‌ మీద ఛాట్‌ అమ్ముతున్నారేంటి అనుకున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఈయన సీఎం కేజ్రీవాల్‌ కాదు కాబట్టి. మరి ఈయన ఎవరనేదేగా మీ ప్రశ్న. ఈయన పేరు గుప్తా. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ బైక్‌పై ‘గుప్తా ఛాట్‌ భండార్‌’ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అచ్చుగుద్దినట్టు అరవింద్‌ కేజ్రీవాల్‌లా ఉండటమే ఈయన ప్రత్యేకత. ఫుడ్‌ బ్లాగర్‌ కరణ్ దువా ‘దిల్‌ సే ఫుడీ’ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ డూప్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ గురించి ప్రపంచానికి తెలిసింది.

ఇక గుప్తాతో మాట కలిపితే ఆనందంగా మాట్లాడారు ‘‘ గ్వాలియర్‌లోని మోతీ మహాల్‌ దగ్గర ఛాట్‌ సమోసా, గులాబ్‌జామున్‌, పాపిడి ఛాట్‌, దహీ దాబా అమ్ముతుంటా. చాలా మంది నన్ను అరవింద్‌ కేజ్రీవాల్‌లా ఉన్నావ్‌ అంటుంటారు. చలికాలంలో మఫ్లర్‌ ధరిస్తే... క్రేజీవాల్‌కి మరింత దగ్గరగా పోలికలతో ఉన్నావ్‌ అని చెబుతుంటారు’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియోని 2లక్షల మందికి పైగా వీక్షించగా అరవింద్‌ కేజ్రీవాల్‌, గుప్తా ఒక్కసారైనా కలుసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని