వేలానికి హిట్లర్‌ వస్తువు: ఇలాంటివి కూడా కొంటారా!

తాజా వార్తలు

Updated : 03/02/2021 11:58 IST

వేలానికి హిట్లర్‌ వస్తువు: ఇలాంటివి కూడా కొంటారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌. రెండో ప్రపంచయుద్ధానికి ప్రధాన కారకుడిగా ఈయన పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన ఓ వస్తువు.. అది కూడా హిట్లర్‌ ‘ఉపయోగించింది’ వేలానికి వచ్చింది. యుద్ధంలో పాల్గొన్న ఓ సైనికుడు..  హిట్లర్‌ వ్యక్తిగత గదిలోంచి దానిని ‘దోచుకున్నాడట.’ కాగా, ఆ సైనికుడి వారసులు ఇప్పుడు దానిని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ప్రస్తుతం మేరీలాండ్‌ రాష్ట్రంలోని అలెగ్జాండర్‌ హిస్టారికల్‌ ఆక్షన్స్‌ వేలం సంస్థ ఆధీనంలో ఉంది. దానికి 15 వేల డాలర్లు వస్తాయని సదరు వేలం సంస్థ భావిస్తోంది.

నీకేది కావలిస్తే అది తీసుకో..

హిట్లర్‌ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బవేరియా దేశంలో ఆల్ప్స్‌ పర్వతాల వద్దనున్న బెర్చ్టెస్గాడెన్ పట్టణ సమీపంలో కొంతకాలం బసచేశాడట. ఆ సమయంలో హిట్లర్‌ ఇంటిని చేరుకున్న అమెరికన్‌ సైనికుల్లో బోర్చ్‌ అనే వ్యక్తి ఒకరు. హిట్లర్‌ ఇంట్లో ‘నీకేది కావలిస్తే అది తీసుకో..’ అని ఓ సైనిక ఉన్నతాధికారి అతనికి అవకాశమిచ్చాడట. ఐతే అప్పటికే బాంబు దాడితో ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టంకావడంతో.. ఇంకేమీ లభించక, దొరికిన ఆ వస్తువునే తీసుకున్నాడట. హిట్లర్‌ వాడిన ఆ అపురూప వస్తువు ఏంటంటే.. రెండు భాగాలుగా ఉన్న చెక్క టాయిలెట్‌ సీటు!  హిట్లర్‌ మౌంటెయిన్‌ అనే పుస్తకంలో కూడా ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తావన ఉంది. దాని కాపీని కూడా ఈ వేలంలో దానిని సొంతం చేసుకున్న వారికి అందచేస్తారు.

అది తమ ఇంటి బేస్‌మెంట్‌లో చాలా కాలం గుర్తింపు లేకుండానే పడిఉండేదని.. సదరు సైనికుడి ఆయన కుమారుడు వివరించాడు. అనంతరం దాని విలువ తెలియటంతో వారు సదరు వేలం సంస్థను సంప్రదించారు. కళ్లను ఇట్టే ఆకట్టుకునే వస్తువుల్లో ఇదీ ఒకటని వేలం సంస్థ  పేర్కొంది. 

ఇవీ చదవండి..

వర్క్‌ ఫ్రం జర్నీ..

ఈ పుస్తకం మనిషిని చంపేస్తుంది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని