రూ.25 వేలకే ట్రాక్టర్‌!

తాజా వార్తలు

Published : 13/06/2021 16:41 IST

రూ.25 వేలకే ట్రాక్టర్‌!

రైతు ఆవిష్కరణ

సాగు పనులకు ట్రాక్టర్‌ కీలకం. దాన్ని కొనాలంటే కనీసం రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేయాలి. అయితే ట్రాక్టర్‌ కొనే స్తోమత లేని ఓ రైతు తనే సొంతంగా ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. కేవలం రూ.25 వేల ఖర్చుతో ఓ మినీ ట్రాక్టర్‌ను రూపొందించాడు. మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా ఘట్‌వాయీ గ్రామానికి చెందిన విజయ్‌సింగ్‌ రఘువంశీ.. ఆటో ఇంజిన్‌తో ఓ మినీ ట్రాక్టర్‌ను తయారు చేశాడు. తొలుత పాడైపోయిన ఆటో నుంచి ఇంజిన్‌ కొని మెకానిక్‌తో బాగు చేయించాడు. తర్వాత సొంతంగా ట్రాక్టర్‌ బాడీ రూపకల్పన చేశాడు. దానికి ఇంజిన్‌ అమర్చి, మూడు చక్రాలు బిగించి మినీ ట్రాక్టర్‌ను సిద్ధం చేశాడు. దీనితో 3 గంటల్లో పావు ఎకరం దున్నవచ్చు. ఇందుకు కేవలం ఒకటిన్నర లీటర్ల డీజిల్‌ సరిపోతోందని విజయ్‌సింగ్‌ చెప్పాడు. ఈ కొత్త యంత్రంతో తన 1.5 ఎకరాల భూమి సాగు సులభమైందన్నాడు. దీన్ని గ్యాస్‌తో పనిచేసేలా కూడా మార్చుకోవచ్చని, 14 లీటర్ల గ్యాస్‌తో 58 నుంచి 62 గంటల పాటు ఇంజిన్‌ నడుస్తుందని వెల్లడించాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని