Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 18/10/2021 13:15 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1) అమ్మవారి పండుగతో రాజకీయాలు చేయొద్దు

ప్రోటోకాల్‌ పేరుతో సాధారణ భక్తులకు పైడితల్లి అమ్మవారి దర్శనాన్ని దూరం చేయొద్దని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు సూచించారు. ఉచిత దర్శనం అందరికీ అందుబాటులో ఉండాల్సిందేనన్నారు. అమ్మవారి పండుగతో రాజకీయాలు చేయొద్దని అధికారులకు హితవు పలికారు. తాను ప్రశ్నిస్తున్నాననే ఆలయ ధర్మకర్త పదవి నుంచి ప్రభుత్వం తొలగించిందని.. కోర్టు ద్వారా నాయ్యం పొందగలిగానన్నారు. అంతకముందు పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకొని అశోక్‌గజపతిరాజు కుటుంబ సమేతంగా ఇవాళ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

2) మా’ బైలాస్‌ మారుస్తాం: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ సభ్యత్వానికి నటుడు నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాళ్లిద్దరి రాజీనామాలపై నటుడు, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న మంచు విష్ణు, ఆయన ప్యానెల్‌ సభ్యులు శ్రీ విద్యానికేతన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విష్ణు, ఆయన ప్యానెల్‌ సభ్యులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్న ప్రకాశ్‌రాజ్‌

3) గతంలో కాంట్రాక్ట్‌ హత్యలుండేవి.. ఇప్పుడు ప్రభుత్వ హత్యలు’

‘మహారాష్ట్రలో రాజకీయ ప్రత్యర్థులను అంతం చేసేందుకు గతంలో కాంట్రాక్ట్ హత్యలుండేవి. ఇప్పుడు ఈ స్థానాన్ని ‘ప్రభుత్వ హత్యలు’ భర్తీ చేశాయ’ని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరోసారి భాజపాపై విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కాంట్రాక్ట్ కిల్లర్స్‌గా పనిచేస్తున్నాయని ఆరోపించారు.

4) ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లలో సినిమాల కళకళ నెమ్మదిగా పెరుగుతోంది. దసరాకు ముందు, పండగ సందర్భంగా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే, ఈసారి ఎక్కువగా చిన్న చిత్రాలు వస్తుండటం గమనార్హం. ఇక ఓటీటీలోనూ ఇంకొన్ని సినిమాలు సందడి చేయటానికి సిద్ధమయ్యాయి.

5) షోయబ్‌ అక్తర్‌కు చురకంటించిన హర్భజన్‌

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తాజాగా మరోసారి చురక అంటించాడు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి మధ్య అటు మైదానంలో, ఇటు సామాజిక మాధ్యమాల్లో మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అక్తర్‌ చేసిన ఓ సరదా ట్వీట్‌కు భజ్జీ తనదైనశైలిలో స్పందించాడు. అతడి పోస్టుకు దీటుగా బదులిచ్చాడు.

బెంగళూరు ‘బెంగ’ తీర్చే సారథి ఎవరు?

6) కిడ్నీ దానం కోసం బెయిల్‌ ఇవ్వొచ్చు

మాదక ద్రవ్యాల కేసులో జైల్లో ఉన్న నిందితుడు ఒకరు తన తండ్రికి మూత్రపిండం దానం చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. మూత్రపిండం దానం చేయడానికి ఆరోగ్యకరంగా ఉన్నాడని వైద్యుల బృందం భావిస్తే తాత్కాలిక బెయిల్‌ కోసం ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఈ బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు సానుభూతితో పరిశీలించాలని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ జె.కె.మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. తొలుత నిందితునికి బెయిల్‌ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. నేరం తీవ్రత దృష్ట్యా బెయిల్‌ ఇవ్వకూడదని ప్రభుత్వం కూడా వాదించింది.

7) 7 రకాల కరెన్సీలు.. 20 లక్షల ఏటీఎంలలో ఈ కార్డు వాడొచ్చు!

విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునే వారి కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొత్తగా మల్టీ కరెన్సీ ఫారిన్‌ ట్రావెల్‌ కార్డు పేరిట కొత్త ప్రీపెయిడ్‌ కార్డును తీసుకొచ్చింది. డాలర్‌, పౌండ్‌, దిర్హమ్‌.. ఇలా ఏడు వేర్వేరు కరెన్సీ లావాదేవీలను ఒకే కార్డు ద్వారా చేయొచ్చు. ఆయా దేశాల్లోని ఏటీఎంలు, మర్చెంట్‌ పాయింట్స్‌ వద్ద ఈ కార్డును వినియోగించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 లక్షల ఏటీఎంలు, 34.5 మిలియన్‌ మర్చెంట్ల వద్ద ఈ కార్డును ఉపయోగించొచ్చని ఎస్‌బీఐ ఓ ప్రకటలో తెలిపింది.

హోంలోన్ చెల్లించడంలో విఫలమైతే ఏమౌతుంది?

8) కశ్మీర్‌ ఉగ్రవాదుల కొత్త వ్యూహం..!

కశ్మీర్‌లో ఉగ్రవాదుల అరచాకం పెరిగిపోతోంది.. గత కొన్నేళ్లుగా భద్రతా దళాలు జల్లెడ పట్టి వారిని మట్టుబెట్టాయి. దీంతో ఉగ్రవాదులు వ్యూహం మార్చారు. ఇప్పుడు చిన్న ఆయుధాలతో పార్ట్‌టైమ్‌ ముష్కరులను దాడులకు పురిగొల్పుతున్నారు. వీరు వలసకూలీలే లక్ష్యంగా దాడులు చేసి తప్పించుకొంటున్నారు. దీనికితోడు స్థానిక ఉగ్రవాదుల మనోస్థైర్యం పెంచేందుకు పాక్‌ సైన్యం అత్యున్నత కమాండోలు నేరుగా శిక్షణ ఇవ్వడం లేదా కశ్మీర్‌లో దాడుల్లో పాల్గోనడం వంటివి చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. 

9) మామ కుటుంబంపై కత్తితో అల్లుడు దాడి

కృష్ణా జిల్లా మైలవరం మండలం వెదురుబీడెంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెదురుబీడెం గ్రామానికి చెందిన కొలుసు కొండలరావు (40)కు ముగ్గురు కుమార్తెలు. మొదటి కుమార్తె ధనలక్ష్మిని గన్నవరం మండలం బల్లిపర్రుకు చెందిన వీర్ల రాంబాబు (30)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది.

10) షాకింగ్‌.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఇల్లు

భారీ వర్షాలు దక్షిణాది రాష్ట్రం కేరళలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎటు చూసిన వరదనీటితో పలు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు కొట్టాయం, ఇడుక్కి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వరద ప్రవాహానికి ఏకంగా ఓ ఇల్లే కొట్టుకుపోయిందంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. కొట్టాయంలోని ముందకాయం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని