Top Ten News @ 1 PM

తాజా వార్తలు

Updated : 28/05/2021 13:20 IST

Top Ten News @ 1 PM

1. Covid Vaccine: అపోహలు..వాస్తవాలు!

దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై గతకొద్ది రోజులుగా ప్రజలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అపోహలు వ్యక్తం చేస్తుండటం కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ల కొరత, విదేశాల నుంచి సేకరణ, ఆయా రాష్ట్రాలకు సరఫరా చేసే విషయాలపై వక్రీకరణలు, అసత్య ప్రచారాలతో అపోహలు తలెత్తున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అలాంటి అపోహలపై స్పష్టతనివ్వడంతో పాటు వాస్తవాలను తెలియజేస్తూ నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona:44 రోజుల కనిష్ఠానికి రోజూవారీ కేసులు

2. CBN: ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆస్తి: చంద్రబాబు

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జీవితం ఈతరానికే కాకుండా భావితరాలకూ దిక్సూచి అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాన్ని సాధించేవరకు రాజీ పడకుండా ముందుకెళ్లిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ నివాళులర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Pfizer: అమెరికా టీకాలకు అడ్డంకులేంటీ..?

ఒక పక్క కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రళయం సృష్టించి ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తోంది.. మరోపక్క థర్డ్‌ వేవ్‌ కొన్ని నెలల్లోనే పడగ విప్పుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సింగపూర్‌ వంటి చోట్ల ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌కు అడ్డుకట్ట వేసే అస్త్రం టీకా మాత్రమే. భారత్‌ పరిస్థితి చూస్తే మరికొన్ని నెలల పాటు టీకా ఉత్పత్తిలో పురోగతి కనిపించే అవకాశం లేదు. అమెరికా వద్ద గోదాముల్లో పడి వున్న ఆరు కోట్ల ఆస్ట్రాజెనెకా టీకాలు భారత్‌కే వస్తాయన్న గ్యారెంటీ లేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Chiranjeevi: ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తే బాగుంటుంది

నట సార్వభౌముడు నందమూరి తారకరామారావుకి భారతరత్న ఇస్తే తెలుగువారందరికీ ఎంతో గర్వకారణంగా ఉంటుందని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. ఎన్టీఆర్‌ 98వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ శుక్రవారం ఉదయం చిరు ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్‌ హజారికా గారికి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారకరామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణం’ అని చిరు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Balakrishna: ఎన్టీఆర్‌ జీవితాన్ని పాఠ్యాంశంగా తేవాలి

5. China: చైనా డ్యామ్‌లకు హిమ ఘాతం

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆనకట్టలతో భారీ స్థాయిలో జల విద్యుదుత్పత్తి చేయాలన్న చైనా ప్రయత్నాలకు భౌగోళికమైన ప్రతికూలతలు అవరోధంగా నిలుస్తున్నాయి. టిబెట్‌లో యార్లుంగ్‌ సంగ్పో(మనదేశంలో బ్రహ్మపుత్ర) నదిపై రెండు డ్యామ్‌లను నిర్మించాలన్నది డ్రాగన్‌ పథకం. దానిలో భాగంగానే త్రీగోర్జెస్‌ డ్యామ్‌ వద్ద ఉత్పత్తి చేసే జల విద్యుత్‌ కన్నా నాలుగు రెట్లు అధిక సామర్థ్యంతో జల విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Vaccine: ‘టీకా వంద శాతం రక్షణ ఇవ్వదు’

కొవిడ్‌-19 నుంచి వ్యాక్సిన్లు 100% రక్షణ కల్పించలేవని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పేర్కొన్నారు. అయితే తీవ్రతను తగ్గిస్తాయని అన్నారు. అందుకే టీకా వేసుకున్నా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారు యాంటీబాడీ టెస్ట్‌లు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తొలి డోసు ఒక సంస్థది, రెండో డోసు ఇంకో సంస్థది తీసుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Kalyanram: పవర్‌ఫుల్‌ టైటిల్‌తో కొత్తసినిమా

నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని చిత్రబృందం ప్రకటించింది. మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ‘బింబిసార’ మోషన్‌ పోస్టర్‌ని చిత్రబృందం షేర్‌ చేసింది. తనపై దండెత్తి వచ్చిన శత్రుమూకలపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడిగా కల్యాణ్‌రామ్‌ కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Rabiya sidhu: రబియా సిద్ధూ లుక్కు.. వెరీ క్లిక్కు!

8. Mehul Choksi: కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. గత ఆదివారం ఆంటిగ్వాలో కన్పించకుండా పోయిన ఆయన రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికా దీవిలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేసి డొమినికా తీసుకెళ్లారని ఛోక్సీ చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది ఆరోపించారు. ఈ మేరకు డొమినికా కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Gmail: నిండిందా? అయితే ఇలా చేయండి!

జూన్‌ 1 తేదీనుంచి గూగుల్ ఫొటోస్‌ స్టోరేజ్‌లో కొన్ని మార్పులు తీసుకురాబోతోంది. దాంతో గూగుల్‌ ఫొటోస్‌లో ఇకపై అపరిమితంగా హై క్వాలిటీ ఫొటోలను అప్‌లోడ్‌ చేయటం కుదరదు. ఇప్పటికే అప్‌లోడ్‌ చేసే ఫొటోలు, వీడియోలు ఏవైనా సరే ఉచిత 15 జీబీ స్టోరేజ్‌ పరిధిలోకే వస్తాయి. ఇది నిండిపోతే, అదనపు స్టోరేజీ కోసం గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. లేదంటే కొన్ని ఫొటోల్ని తొలగించాలి. అయితే ఉచిత 15 జీబీ ఇతర గూగుల్‌ యాప్స్‌కి కూడా క్లౌడ్‌ స్టోరేజ్‌గా పనిచేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Sushil Kumar: సుశీల్‌ దాడి చేసిన వీడియోల కలకలం!

యువ రెజ్లర్‌ సాగర్‌ రాణాపై సుశీల్‌ కుమార్‌ దాడి చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఈ పుటేజీ హిందీ, ఇంగ్లిష్‌ మీడియాలో ప్రసారం అవుతోంది. ఛత్రసాల్‌ స్టేడియంలో రాత్రివేళ పది మందికి పైగా కలిసి రాణాపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అందులో సుశీల్‌ బేస్‌బాల్‌ స్టిక్‌/కర్రను చేతిలో పట్టుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించాడు. ఈ వీడియో క్లిప్‌ బయటకు రావడంతో అతడికి మరింత నష్టం కలగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IPL 2021: యూఏఈలో ఆడితే ఆటంకాలే..! 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని