Top Ten News @ 1 PM

తాజా వార్తలు

Updated : 06/06/2021 13:08 IST

Top Ten News @ 1 PM

1. Fauci: వుహాన్‌ వ్యూహంలో ఫౌచీ?

కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చనే వాదనలు బలపడే కొద్దీ అమెరికాకు చెందిన అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై స్వదేశంలో విమర్శలు పెరిగిపోతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్లు అయితే ఆయనను ఓ అబద్ధాలకోరుగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఫౌచీ ఈ మెయిల్స్‌ బహిర్గతమైన నేపథ్యంలో ఆరోపణలను తీవ్రతరం చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌ సలహాదారు పదవి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. HYD: కొన‌సాగుతున్న మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ 

క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో భాగంగా న‌గ‌రంలో నిర్వ‌హిస్తున్న అతిపెద్ద వ్యాక్సినేష‌న్ డ్రైవ్ కొన‌సాగుతోంది. హైటెక్స్ లో మొత్తం 30 హాళ్ల‌లో ఏర్పాటు చేసిన 300 టేబుళ్ల వ‌ద్ద టీకాలు వేస్తున్నారు. తొలి గంట‌లో 5 వేల మంది వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఒకేచోట 40 వేల మందికి టీకా ఇచ్చేందుకు చేస్తున్న ఈ డ్రైవ్‌ దేశంలోనే మొదటిసారి కావడం గమనార్హం. ఇందుకు హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ కేంద్రం వేదిక  అయింది. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్‌ పోలీసులు, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మెడికవర్‌ ఆసుపత్రులు ఈ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* టీకా భుజంమీదే ఎందుకు?

3. Krishnapatnam: సోమిరెడ్డిపై కేసు నమోదు

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదైంది. సెశ్రిత టెక్నాలజీ ఎండీ నందకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్టు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సోమిరెడ్డిపై చీటింగ్‌, ఫోర్జరీ, దొంగతనం ఆరోపణలతో కేసులు పెట్టారు. ఐటీ చట్టం కిందా ఆయనపై కేసు నమోదు చేశారు. సెశ్రిత కంపెనీ, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై శనివారం సోమిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Vaccine: ముల్లును ‘ముల్లు’తోనే.. కార్బివాక్స్‌ 

కరోనావైరస్‌లో అత్యంత ప్రమాదకరమైన భాగం స్పైక్‌ ప్రొటీన్‌. ఇది మానవ శరీరంలో తయారయ్యే ఏసీఈ-2 అనే ఎంజైమ్‌కు అతుక్కొని శరీరంలోకి వైరస్‌ ఆర్‌ఎన్‌ఏను పంపిస్తుంది. ఈ ప్రక్రియను అడ్డుకునే విధంగా టీకాలను తయారు చేస్తున్నారు. వీటికి ఇప్పటి వరకు అచేతన వైరస్‌, మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ, కరోనా వైరస్‌ను రూపు పోలిన  అడినో వైరస్‌తో టీకాలను చేశారు. తాజాగా భారత్‌లో మరో టీకా విడుదలకు సిద్ధమైంది. బయోలాజికల్‌-ఇ రూపొందిస్తున్న టీకాలో కొంచెం భిన్నమైన టెక్నాలజీని వాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona : మరింత తగ్గుముఖం పట్టిన కేసులు

5. Petrol price: సెంచరీ దాటినా ఆగని పరుగు! 

ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రజలను.. చమురు ధరల పెరుగుదల మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం పెట్రోలుపై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచారు. ధరల పెంపు ఆరు రోజుల్లో ఇది మూడోసారి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.98.76, డీజిల్‌ ధర రూ.93.70కి చేరింది. మరోవైపు ఇంధనం నిల్వ కేంద్రం నుంచి రవాణా దూరం ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, జోగులాంబ, కుమురం భీం, నిర్మల్‌ జిల్లాల్లో లీటరు పెట్రోలు ధర రూ.వంద దాటిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Cinema News: గాసిప్స్‌ నిజమైతే ఆ లెక్క వేరే..

సినీ పరిశ్రమలో గాసిప్స్‌కి కొదవే ఉండదు. ఎప్పుడూ ఎదో ఒక సినిమా లేదా నటీనటుల గురించో పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇక, సోషల్‌మీడియా వచ్చాక ఇలాంటి వార్తలకు అంతు లేకుండా పోయింది. అలా, గత కొన్నిరోజుల నుంచి మనం తరచూ వింటోన్న సరదా పుకార్ల గురించి ఒక్కసారి చూద్దాం..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జ్ఞాపకాలు చెరిపేస్తే... ప్రేమ చెదిరిపోతుందా?

7. TS News: ధ‌ర‌ణిలో నమోదైన అందరికీ రైతుబంధు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం జ‌మ చేస్తామ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారిన రైతుల ఖాతాల్లోనూ నిధులు జ‌మ చేస్తామ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ లోపు వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ అధికారుల ద్వారా రైతుల బ్యాంకు ఖాతా వివ‌రాలు సేక‌రిస్తామ‌ని తెలిపారు. క‌ర్ష‌కులు స్థానిక వ్య‌వ‌సాయ అధికారుల‌ను సంప్ర‌దించి బ్యాంకు ఖాతా, పాస్‌బుక్, ఆధార్ వివ‌రాలు అందించాల‌ని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. WTC Finals: టీమ్‌ఇండియానే ఫేవరెట్‌

మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోటీపడే టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌.. రెండు జట్లూ బలంగా ఉన్నాయని, అయితే కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగనుందని మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌ఇండియా సవాళ్లను చూసి భయపడదని, ధైర్యంగా ముందుకు సాగుతుందని చెప్పాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన అందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Cricket News: అశ్విన్‌ విషయంలో అంచనా తప్పు

9. TS News: 8న తెలంగాణ కేబినెట్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్‌ భేటీలో వివిధ కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, థర్డ్‌వేవ్‌ సన్నద్ధత, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలు, వానాకాలంలో సాగునీరు తదితర అంశాలపై సమీక్షించే వీలుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Vaccine: టీకా వేసుకోకుండా బయట.. జరిమానానే!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయట తిరగకుండా నిలువరించడంతో పాటు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసే దిశగా మహారాష్ట్రంలోని ఔరంగాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ తీసుకోకుండా బయట తిరిగే వారికి రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించారు. అయితే, ఈ నిబంధన 45 ఏళ్లు పైబడిన వారికే వర్తిస్తుందని కార్పొరేషన్‌ వైద్యాధికారి నీతా పడాల్‌కర్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Bollywood: ఆస్పత్రిలో చేరిన దిలీప్‌కుమార్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని