Top Ten News @ 1 PM

తాజా వార్తలు

Updated : 18/06/2021 13:20 IST

Top Ten News @ 1 PM

1. Raghurama: 15 రోజుల్లో వివరాలివ్వండి

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభాహక్కుల నోటీసుపై లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం స్పందించింది. మే 14న తనని అరెస్ట్‌ చేయడం, ఆ తర్వాత తీవ్రంగా హింసించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం, డీజీపీ, సీఐడీ ఏడీజీ, సీఐడీ ఎస్పీలపై ఆయన సభాహక్కుల నోటీసు ఇచ్చారు. ఇదే విషయంపై ఆయన కుమారుడు భరత్‌, తెదేపా ఎంపీలు కనమేడల రవీంద్రకుమార్‌, రామ్మోహన్‌నాయుడు కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. WTC Final: 90% వర్షం కురుస్తుందని అంచనా!

అరంగేట్రం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. మొదటి రోజైన శుక్రవారం సౌథాంప్టన్‌లో వర్షసూచన కనిపిస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్‌ సవ్యంగా సాగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ భారీ వర్షం కురవకపోయినా చిరుజల్లులు పదేపదే మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అక్కడి వర్గాలు అంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Virat Kohli: ఫైనల్లో ఓడితే ప్రపంచం ఆగిపోదు!

3. Satya nadella: సత్య జర్నీ చెబుతోందేంటి?

హైదరాబాదీ కుర్రాడు సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా ఎదిగారు సరే! ఇంతకూ... ఆయన జర్నీ చెబుతోందేంటి? ఈతరం కుర్రకారు సత్యనాదెళ్ళ జర్నీలో చూడాల్సిందేంటి?ఈరోజు పిల్లల్లాగే... ఆరోజుల్లో కూడా సత్య కూడా ఐఐటీలో సీటు కోసం కలలు కన్నాడు. కానీ రాలేదు. అయినా నిరాశ చెందలేదు. మణిపాల్‌ వర్సిటీ నుంచి... బీటెక్‌ పూర్తి చేసిన సత్య ఎన్నడూ తాను ఐఐటియన్‌ కాదని బాధపడలేదు. తన జర్నీ ఆపిందీ లేదు. మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ అయ్యాడంటే.. ఏ హార్వర్డ్‌లోనో చదివి ఉంటాడనుకుంటే కూడా పొరపాటు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ ఔషధంతో చిన్నారుల్లో తీవ్ర కొవిడ్‌కు చెక్‌

ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి వాడే కార్టికో స్టెరాయిడ్లు.. కొవిడ్‌ బాధిత చిన్నారుల్లో తీవ్రస్థాయి రుగ్మతకు చికిత్సగా ఉపయోగపడతాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ (ఎంఐఎస్‌-సి) అనే రుగ్మత.. కొవిడ్‌ బారినపడిన 50వేల మంది చిన్నారుల్లో ఒకరికి వస్తుందని అంచనా. వైరస్‌ సోకిన 2-6 వారాల్లో ఇది తలెత్తవచ్చు. ఫలితంగా బాధితుల్లో తీవ్ర జ్వరం, ఉదర భాగంలో నొప్పి, వాంతులు, కళ్లు ఎర్రబారడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు వంటివి రావొచ్చు. రక్త నాళాలు వ్యాకోచించొచ్చు. ఈ రుగ్మతతో మరణం ముప్పు కలిగించొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: 1500కి దిగొచ్చిన రోజువారీ మరణాలు..

5. Ambani case: ప్రదీప్‌ ఆదేశాలతోనే రంగంలోకి హంతకులు..! 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీకి బెదిరింపుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్ష్యాలను మాయం చేసేందుకు ఒకప్పటి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టులు పరస్పరం సహకరించుకొన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధరణకు వచ్చింది. వీరిద్దరి కనుసన్నల్లోనే అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు పెట్టిన కారును ఉంచడం, కీలక సాక్షి మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్య జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఘటనలు జరిగిన తొలినాళ్లలోనే ప్రదీప్‌ శర్మను ఎన్‌ఐఏ అధికారులు అనుమానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Twitter: ట్విటర్‌ ఎండీకి యూపీ పోలీసుల నోటీసు!

6.  AP News: ఏపీలో కర్ఫ్యూ వేళలు సడలింపు

రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ వేళలను ఏపీ ప్రభుత్వం సడలించింది. కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సడలింపులు ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండగా.. తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటలకు పెంచారు. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. AP News: మా ఓపికను పరీక్షించొద్దు: లోకేశ్‌

కాపా అరాచకాలకు తాము భయపడి పారిపోయే వాళ్లం కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 27 మంది తెదేపా కార్యకర్తలను దారుణంగా చంపారని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లా పెసరవాయిలో గురువారం హత్యకు గురైన తెదేపా నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబాలను లోకేశ్‌ పరామర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. TS News: చితిపేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్‌లో విషాదం చోటుచేసుకుంది. కూలగొట్టిన తన ఇంటి ఆవరణలోనే చితి పేర్చుకుని మల్లారెడ్డి అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చితిలో మిగిలిన శరీర భాగాలను పోస్టుమార్టానికి పంపించారు. వృద్ధుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* TS News: నీటి ట్యాంకులో విగతజీవిగా చిన్నారి

9. మీరు ఈపీఎఫ్ చందాదారులా.. అయితే ఈ 5 అప్‌డేట్లు తెలుసుకోండి

ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ, ఉద్యోగి అవ‌స‌రాల కోసం ప్రావిడెండ్ ఫండ్‌ను(పీఎఫ్‌) విత్‌డ్రా చేసుకునేందుకు  వీలుక‌ల్పిస్తూ ఇటీవ‌ల కొన్ని ప్ర‌క‌ట‌న‌లను విడుద‌ల చేసింది. సేకెండ్ వేవ్ కార‌ణంగా మ‌రోసారి నాన్‌-రిఫండ‌బుల్స్‌ అడ్వాన్సు అందిస్తున్న‌ట్లు పేర్కొంది. దీనితో పాటు మ‌రికొన్ని అప్‌డేట్‌ల‌ను ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న  ఈపీఎఫ్ చందాదారులు నిధులు స‌మ‌కూర్చుకునేందుకు ఇది స‌హాయ‌ప‌డుతుంద‌ని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Dhanush: శేఖర్‌ కమ్ములతో ప్రాజెక్ట్‌ ఫిక్స్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ కొత్త ప్రాజెక్ట్‌ ఖరారైంది. క్లాసిక్‌ ప్రేమకథా చిత్రాలకు టాలీవుడ్‌లో కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్‌ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Cinema News: ఇదే నా శపథం: శ్రీ విష్ణు



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని