Top Ten News @ 1 PM

తాజా వార్తలు

Updated : 20/06/2021 13:14 IST

Top Ten News @ 1 PM

1. WTC Final: 250+ చేస్తే కోహ్లీసేనదే పైచేయి!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 250+ పరుగులు చేస్తే న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చెలాయించొచ్చని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అది మెరుగైన స్కోరేనని పేర్కొన్నాడు. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ చక్కని భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారని వెల్లడించాడు. వెలుతురు లేమితో రెండో రోజు శనివారం ఆట ముగిసే సరికి టీమ్‌ఇండియా 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (44 బ్యాటింగ్‌; 124 బంతుల్లో 1×4) అర్ధశతకానికి చేరువయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

WTC Final: మూడో రోజు ఆట కొనసాగేనా?

2. Facebook: వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే..!

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఎదుట హాజరయ్యే అంశంలో ఫేస్‌బుక్‌కు ఊరట లభించలేదు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ స్టాండింగ్‌ కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కమిటీ ప్రజల హక్కులు కాపాడటం, సోషల్‌ మీడియా వేదికల దుర్వినియోగాన్ని అడ్డుకొనే అంశంపై విచారణ చేపట్టింది. కానీ, ఫేస్‌బుక్‌ యాంటీ కొవిడ్‌ పాలసీ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని.. వర్చ్యువల్‌గా ప్యానల్‌ ఎదుటకు వస్తామని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Petrol Prices: ఆగని పెట్రో బాదుడు!

దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచుతూ దేశీయ ఇంధన విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.36కు.. డీజిల్‌ రూ.95.44కు చేరుకుంది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో అత్యధికంగా లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.108.37కి చేరడం గమనార్హం. ఇప్పటికే మొత్తం 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 పైకి ఎగబాకిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Raghurama: అమ‌రావ‌తిపై నిర్ణ‌యం మార్చ‌డం పెద్ద‌రికం కాదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగుతుంద‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అన్నార‌ని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఇప్ప‌టికే న‌వ‌హ‌మీలు- వైఫ‌ల్యాల పేరుతో సీఎంకు తొమ్మిది లేఖ‌లు రాసిన ఎంపీ.. న‌వ ప్ర‌భుత్వ క‌ర్త‌వ్యాలు పేరుతో మ‌రో 9 లేఖ‌లు రాస్తాన‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఆయ‌న ఇవాళ రాసిన లేఖ‌లో అమ‌రావ‌తిని కొన‌సాగించే విష‌యంపై ప్ర‌స్తావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Covid: ఆ 75వేల మంది ఎలా చనిపోయారో..?

 కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ ప్రభావంతో బిహార్‌లో మరణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో దాదాపు 75 వేల మంది గుర్తుతెలియని కారణాలతో కన్నుమూశారు. ఆ రాష్ట్ర అధికారిక కొవిడ్‌ మృతుల సంఖ్యతో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మృతుల సంఖ్యను తగ్గించి చూపిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  ఆ రాష్ట్ర ప్రభుత్వ సివిల్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం లెక్కల ప్రకారం 2019 జనవరి-మే మధ్యలో 1.3లక్షల మంది కన్నుమూశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Vaccine: అత్యవసరంగా టీకాలు మళ్లీ పంపండి 

6. CM KCR: సిద్దిపేట‌లో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ సిద్దిపేట‌లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టనున్నారు. ఆధునిక స‌దుపాయాల‌తో జీప్ల‌స్ వ‌న్‌గా ఎక‌రం విస్తీర్ణంలో రూ.4 కోట్ల‌తో సిద్దిపేట ఎమ్మెల్యే కార్యాల‌యాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యాల‌యం, మొద‌టి అంత‌స్తులో నివాస స‌ముదాయం ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. AP News: ప్రేమ‌జంట‌పై అఘాయిత్యం

గుంటూరు జిల్లా తాడేప‌ల్లి ప‌రిధిలోని సీతాన‌గ‌రంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి పుష్క‌ర‌ఘాట్‌లోని ఇసుకలో కూర్చుని ఉన్న‌ ప్రేమ‌జంట‌పై దాడి జ‌రిగింది. యువ‌కుడిని తాళ్ల‌తో క‌ట్టేసిన ఇద్ద‌రు దుండ‌గులు.. ఆపై యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఘ‌ట‌న‌పై ఈ తెల్ల‌వారుజామున బాధితులు తాడేప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి గురైన యువ‌తిని చికిత్స కోసం పోలీసులు ఆస్ప‌త్రికి త‌రలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Corona : 81 రోజుల తర్వాత 60 వేల దిగువకు..

దేశంలో కరోనా ఉద్ధృతి మరింత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు 60 వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 18,11,446 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 58,419 కేసులు నమోదయ్యాయి.  81 రోజుల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక మరణాల సంఖ్య కూడా 1500 వద్దే నమోదవుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: ఏపీలో మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌

9. వివేకా హ‌త్యకేసు: 8 మందిని విచారిస్తున్న సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ 14వ రోజు కొన‌సాగుతోంది. క‌డ‌ప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇవాళ ఎనిమిది మంది అనుమానితుల‌ను అధికారులు విచారిస్తున్నారు. మూడు రోజులుగా వివేకా ప్ర‌ధాన అనుచ‌రుడు ఎర్ర‌గంగిరెడ్డిని ప్ర‌శ్నిస్తున్న అధికారులు.. ఇవాళ కూడా అత‌డిని విచార‌ణ‌కు పిలిచారు. ఆయ‌న‌తో పాటు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం సింహాద్రిపురానికి చెందిన అశోక్‌కుమార్‌, ఓబుల‌ప‌తి నాయుడు, రాఘ‌వేంద్ర‌ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Fathers day: నాన్నే తొలి హీరో!

ఆయన కడుపున మోసి జన్మనివ్వలేదు. జోల పాడి నిద్రపుచ్చలేదు. పాలుపట్టి ఆకలి తీర్చలేదు. అయినా అమ్మకన్నా నాన్న ఎందులో తక్కువ? ఏది కోరినా చిటికెలో తెచ్చిస్తాడు. కుటుంబం కోసం ప్రపంచంతో పోరాడతాడు. కలల్ని త్యాగం చేసి పిల్లల శ్రేయస్సు కోసం బతుకుతాడు. కన్నతల్లి కన్నా నాన్న ఏం తక్కువ చేశాడు? ఆయన కోపం వెనకే ఉండే ప్రేమకు, వెన్నలాంటి మనసుకు అసలు గుర్తింపు ఉండదెందుకు? నాన్నే కదా కుటుంబానికి ధైర్యం, భరోసా. ఆయన త్యాగాలు, చెమట నెత్తుళ్ల మీదే కదా పిల్లలు కలల సౌధాలను నిర్మించుకునేది. అయినా నాన్న ఎందుకు వెనకబడ్డాడు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ప్రిన్స్‌.. లవర్‌ బాయ్‌ టు కండల వీరుడు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని