Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 01/08/2021 13:15 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Tokyo olympics : క్వార్టర్స్‌లో నిరాశపరిచిన భారత బాక్సర్‌ సతీశ్‌కుమార్‌

టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్‌లో భారత బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ నిరాశపరిచాడు. బాక్సింగ్‌ 91+ కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ జలొలోవ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. సతీశ్‌పై 5-0 తేడాతో జలొలోవ్‌ గెలుపొందాడు. బాక్సింగ్‌లో నిన్న భారత్‌కు ఊహించని ఫలితం ఎదురైంది. కచ్చితంగా పతకం తెస్తాడన్న అంచనాలు ఉన్న టాప్‌ సీడ్‌ అమిత్‌పంగాల్‌(52 కిలోలు) ప్రిక్వార్టర్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Virus Mutations: మానవ శరీరంలోనే వైరస్‌ మార్పులు 

బాధితుడి శరీరంలోకి ప్రవేశించాక కరోనా వైరస్‌ జన్యుక్రమంలో జరిగే మార్పులు.. కొత్త వేరియంట్లలోనూ ప్రతిబింబిస్తున్నాయని భారత శాస్త్రవేత్తలు తేల్చారు. ఉద్ధృతంగా వ్యాపించే కరోనా వైరస్‌ రకాల వ్యాప్తి, సాంక్రమిక శక్తిపై ముందస్తు అంచనాలు వేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అలాగే బాధితుడి శరీరంలో ఉన్నప్పుడు వైరస్‌లో జరిగే మార్పులను పరిశీలించడం ద్వారా.. దాని మనుగడకు కీలకంగా మారే/ అవరోధంగా తయారయ్యే భాగాలను గుర్తించడానికి వీలవుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* India Corona : కొత్తగా 41,831 కేసులు.. 541 మరణాలు

3. Pegasus Spyware: పెగాసస్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ

వర్షాకాల పార్లమెంటు సమావేశాలను కుదిపేసిన పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ద్విసభ్య ధర్మాసనం దీనిపై వాదనలు విననుంది. దీనిపై ప్రస్తుత లేదా విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ సహా సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌, న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యవహారం పర్యవసానాలు చాలా అధికంగా ఉన్నందున.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
4. RRR: ఎదురుచూపులకు ఇక ఫుల్‌స్టాప్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘దోస్తీ’ సాంగ్‌ వచ్చేసింది..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సంగీత ప్రియుల ఎదురుచూపులకు సమాధానం చెబుతూ రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘దోస్తీ’ సాంగ్‌ వచ్చేసింది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం విడుదలైన ఈ పాట ప్రతిఒక్కర్నీ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. కీరవాణి సారథ్యంలో హేమచంద్ర (తెలుగు), అమిత్‌ త్రివేది (హిందీ), అనిరుధ్‌ (తమిళం), యాసిన్‌ నజీర్‌ (కన్నడ), విజయ్‌ జేసుదాస్‌ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు సంగీత యువ కెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Rocket attack: కాందహార్‌ విమానాశ్రయంపై రాకెట్ల దాడి

అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి రాకెట్ల దాడి జరిగింది. ఈ విషయాన్ని విమానాశ్రయ చీఫ్‌ మసూద్‌ పష్తూన్‌ ధ్రువీకరించారు. రెండు రాకెట్లు రన్‌వేను తాకాయని తెలిపారు. దీంతో విమాన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయన్నారు. రన్‌వేను బాగుచేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఆదివారం మధ్యాహ్నానికి విమాన సేవలు పునరుద్ధరించే అవకాశం ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Assam-Mizoram border dispute: అస్సాం-మిజోరం సరిహద్దు.. నివురుగప్పిన నిప్పు

6. నాన్న... నావల్ల నష్టపోయాడన్నారు!

ఎస్‌.పి.చరణ్‌... గానగంధ్వరుడి ఒడిలో పెరిగినా తాను మాత్రం గాయకుడు అవ్వాలనుకోలేదు. అనుకోకుండానే గాయకుడై ‘అరె, అచ్చం వాళ్ల నాన్నగారిలాగే పాడుతున్నాడే!’ అనిపించుకున్నాడు. నిర్మాతగా మంచి సినిమాలు తీసినా పేరు తప్ప డబ్బు రాలేదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి, కాస్త నిలదొక్కుకుంటూ ఉండగా తండ్రి హఠాన్మరణం! ఆ బాధ నుంచి కోలుకుంటూ... ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో సరికొత్తగా సంగీతప్రియుల ముందుకు రాబోతున్న చరణ్‌ జీవితంలోని చీకటి వెలుగులు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. TS News: లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

గరంలోని పాతబస్తీలో లాల్‌దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భాజపా నేత విజయశాంతి తదితరులు దర్శనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* TS News: ఈటలను పరామర్శించిన రఘునందన్‌, రాజాసింగ్‌

8. కొండపల్లిలో అక్రమ మైనింగ్‌కు బీజం వేసింది వైఎస్సే: పట్టాభి

కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు బీజం వేసింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డేనని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. తండ్రి బీజం వేస్తే కుమారుడు అధికారంలోకి వచ్చాక దాన్ని పెంచి పెద్దది చేశారని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.  ‘‘వైఎస్‌ఆర్‌ హయాంలో రెవెన్యూ రికార్డులను టాంపర్‌ చేసి లేని సర్వే నంబర్‌ 143ను సృష్టించారు’’ అని పట్టాభి ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Anand Mahindra: ఆదివారం వ్యాయామం చేయడానికి బద్ధకమా? ఆనంద్‌ మహీంద్రా చిట్కా!

సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లకు ఏదో కొత్త విషయాన్ని తెలియజేసే మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా మరో కొత్త చిట్కాతో మన ముందుకు వచ్చారు. ఆదివారం వ్యాయామం చేయడానికి బద్ధికించే వారికోసం ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తానూ ఈ కేటగిరీకే చెందినవాడినంటూ చమత్కరించారు. ఆదివారం వ్యాయామం చేయకపోయినా.. ఆ వీడియో చూస్తే చాలని సరదాగా వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు

తెలంగాణ-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దు భద్రాచలం మన్యంలోని చర్ల అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందాడు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్‌ బలగాలు, ప్రత్యేక పోలీసు దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మండలంలోని కీకారణ్యం ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

UP: తండ్రిని బెదిరించి రూ.కోటి డిమాండ్‌ చేసిన 11 ఏళ్ల బాలిక


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని