Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 05/09/2021 13:17 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Panjshir: పంజ్‌షేర్‌లో 600 మంది తాలిబన్ల మృతి?

అఫ్గాన్‌లో తాలిబన్లకు కొరకరాని కొయ్యలా మారిన ‘పంజ్‌షేర్‌’లో 600 మంది తాలిబన్లు మృతిచెందినట్లు ‘నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌’ వర్గాల ద్వారా తెలుస్తున్నట్లు రష్యాకు చెందిన ప్రముఖ మీడియా స్పుత్నిక్‌ తెలిపింది. మరో 1000 మంది తాలిబన్లు రెసిస్టెన్స్‌ దళాల అధీనంలో ఉన్నట్లు పేర్కొంది. వీరిలో కొందరిని రెసిస్టెన్స్ దళాలు అదుపులోకి తీసుకోగా.. మరికొందరు తమకు తామే లొంగిపోయారని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Afghanistan: అఫ్గాన్‌లో సెక్స్‌ వర్కర్లకు బహిరంగ మరణశిక్ష?

2. Traffic jam: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై వరద.. స్తంభించిన ట్రాఫిక్‌

శనివారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలోని చింతలచెరువు నిండిపోయింది. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైకి  వరద పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వరదనీరు చేరడంతో ఈ ఉదయం హైవేపై ట్రాఫిక్‌ స్తంభించింది. స్థానిక పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. మరోవైపు బాటసింగారం నుంచి మజీద్‌పూర్‌ వెళ్లే దారిలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Nipah virus: కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. బాలుడి మృతి!

కేరళలో నిఫా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు. గత రాత్రి తీవ్ర అస్వస్థకు గురైన బాలుడికి చికిత్స అందిస్తుండగానే ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. బాలుడి నమూనాలను ముందే పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కి పంపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: 42 వేల కొత్త కేసులు.. కేరళలోనే 29 వేలకుపైగా

4. Hyderabad Metro: రేపట్నుంచి మెట్రో రైలు సమయాల్లో మార్పులు
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రేపట్నుంచి మార్పులు జరగనున్నాయి. చివరి మెట్రో సర్వీస్‌ సమయాన్ని అరగంట పొడిగించారు. రాత్రి 10.15 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీస్‌ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. రాత్రి 9.45 గంటల వరకే ఉన్న చివరి మెట్రో సర్వీస్‌ను అరగంట పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు ఎప్పటి మాదిరే ఉ.7 గంటల నుంచి మెట్రో రైలు సేవలు కొనసాగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. IND vs ENG: రోహిత్‌ శర్మ శతకం.. నమోదైన రికార్డులు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్‌ రోహిత్ శర్మ(127;256 బంతుల్లో 14×4,1×6) అద్భుతమైన శతకంతో మెరిశాడు. కాగా రోహిత్‌ సిక్స్‌తో సెంచరీ సాధించడం విశేషం. సుదీర్ఘ ఫార్మాట్‌లో విదేశీ గడ్డపై హిట్‌మ్యాన్‌కు ఇది తొలి శతకం కాగా.. మొత్తంగా ఎనిమిదోది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ బాదడం ద్వారా పలు రికార్డులను నమోదు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Manike Mage Hithe: సూపర్‌స్టార్‌ మది దోచిన వైరల్‌ సాంగ్‌.. ఇంతకీ ఎవరా సింగర్‌?

మాణికే మాగే హితే..!’.. గత కొన్ని నెలల నుంచి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న పాట. ముఖ్యంగా ఇన్‌స్టాలో ఈ పాటకు ఉన్న ఫాలోవర్స్, లవర్స్‌ సంఖ్య అంతా ఇంతా కాదు. శ్రీలంకకు చెందిన ఓ పాప్‌ సింగర్‌ ఆలపించిన ఈ ఫీల్‌ గుడ్‌ పాటకు ఇటీవల మన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఫిదా అయ్యారు. ఈ పాట తనకు ఎంతగానో నచ్చిందని.. ఒక రాత్రంతా రిపీట్‌ మోడ్‌లో విన్నానని ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Teachers day Special : వెండితెర గురువులు

7. Lockdown effect on diabetes: మధుమేహం ముప్పును పెంచిన లాక్‌డౌన్‌

కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్‌ల వల్ల అనేక మంది బరువు పెరిగారని, ఫలితంగా వారికి టైప్‌-2 మధుమేహం ముప్పు ఎక్కువైందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్‌లో ‘నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌’ (ఎన్‌హెచ్‌ఎస్‌) చేపట్టిన మధుమేహ నివారణ కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో భాగంగా 40 ఏళ్లలోపు వారి డేటాపై అధ్యయనం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Afghanistan crisis: అమెరికా.. మళ్లీ అదే తప్పు!

ఉగ్ర పోరులో పాకిస్థాన్‌ది ఎప్పుడూ వెన్నుపోటు ధోరణే. అమెరికాపై 9/11 దాడుల తర్వాత అల్‌ఖైదా.. ఆ సంస్థకు ఆశ్రయమిస్తున్న తాలిబన్లను అంతమొందించడానికి సహకరిస్తామని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించి వంచించింది. మద్దతిస్తున్నట్లు నటిస్తూనే.. తాలిబన్లకు, అల్‌ఖైదా అధిపతి ఒసామా బిన్‌లాడెన్‌కు తన దేశంలోనే ఆశ్రయమిచ్చి.. పోషించింది. నాడు నాటో దాడులకు చెల్లాచెదురైన తాలిబన్లు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Attack: హెయిర్‌ కటింగ్‌ విషయంలో గొడవ.. స్నేహితుడిపై కత్తెరతో దాడి

హెయిర్‌ కటింగ్‌ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తిపై కత్తెరతో దాడికి పాల్పడేలా చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంజనేయులు అనే వ్యక్తి హెయిర్‌ కటింగ్‌ కోసం స్థానిక కనకదుర్గమ్మ గుడికి సమీపంలో ఉన్న ఓ సెలూన్‌కు వెళ్లాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Ludo Game: లూడో గేమ్‌ విషయంలో ఘర్షణ.. పాతబస్తీలో యువకుడి మృతి

10. Paralympics: స్వర్ణంతో అదరగొట్టిన కృష్ణ నాగర్‌

పారాలింపిక్స్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌-6లో కృష్ణ నాగర్‌ స్వర్ణంతో అదరగొట్టాడు. ఫైనల్లో హాంకాంగ్‌ ఆటగాడు కైమన్‌ చూపై కృష్ణ విజయం సాధించి పసిడిని ముద్దాడాడు. ఈరోజు ఇప్పటికే భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. ఈ ఉదయం బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-4 విభాగంలో సుహాస్‌ యతిరాజ్‌ రజతం సాధించగా తాజాగా కృష్ణ స్వర్ణం తీసుకొచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని