Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 07/09/2021 13:11 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Haqqani vs Taliban : పాక్‌ స్క్రీన్‌ ప్లే.. హక్కానీల హైడ్రామా..!

ప్రపంచ దేశాలు అఫ్గానిస్థాన్‌ను వదిలేయడంతో ఆ దేశాన్ని పీల్చి పిప్పి చేసే పనిని పాక్‌ మొదలు పెట్టింది. తాలిబన్‌ ప్రభుత్వంలో తాము సూచించిన వ్యక్తులకు పట్టాభిషేకం చేసేలా పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తాలిబన్లలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఏకంగా తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడినే కొట్టారు. దీంతో పాక్‌ అనుకూల హక్కానీ నెట్‌వర్క్‌, తాలిబన్లకు మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటకు పొక్కాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Heavy Rains in Telangana: తెలంగాణలో భారీవర్షాలు.. పలు చోట్ల రాకపోకలు బంద్‌

తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, వరంగల్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. వర్ష బీభత్సానికి ఎక్కడికక్కడ చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే సిరిసిల్ల పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణంలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. కరీంనగర్‌ నగరంలో ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Sircilla: ఎడతెరిపిలేని వర్షం.. జలదిగ్బంధంలో సిరిసిల్ల

3. Ganesh Idols: చెత్త ట్రాక్టర్లలో వినాయక విగ్రహాల తరలింపు ఘటన.. అధికారిపై వేటు

గుంటూరులో చెత్తను తరలించే వాహనాల్లో వినాయక విగ్రహాలను తరలించిన పారిశుద్ధ్య సిబ్బందిపై కమిషనర్‌ అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ సూపర్‌ వైజర్‌ను విధుల నుంచి తొలగించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా అత్యుత్సాహంతో వినాయక విగ్రహాలను పారిశుద్ధ్య ట్రాక్టర్‌లో వేసి తీసుకెళ్లడంపై ఆమె మండిపడ్డారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్‌తో విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Rahul Gandhi: విద్యార్థుల ఒత్తిడిని పట్టించుకోరా.. నీట్‌ వాయిదా వేయండి!

వచ్చే ఆదివారం జరగబోయే నీట్‌ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఒత్తిడిని ప్రభుత్వం పట్టించుకోకుండా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. సెప్టెంబరు 12న జరిగే నీట్‌ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Tollywood Actress: ఇక్కడ ఆరంభించారు.. అక్కడ అదరగొడుతున్నారు!

తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ జీవితాన్ని మొదలుపెట్టి, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్‌ సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు కొందరు హీరోయిన్లు. కోలీవుడ్‌ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కిన తర్వాత తిరిగి తెలుగులోనూ నటించి మెప్పిస్తున్నవారు కొందరైతే, తమిళ పరిశ్రమకే పరిమితమైనవారు మరికొందరు. ఈ మధ్యే సోడాల శ్రీదేవిగా అలరించిన ఆనంది, దివ్యగా మెప్పించిన సునైనలు తిరిగి మొదటి అడుగులు పడిన చోటుకి వచ్చినవారే. అలా కోలీవుడ్‌లో తమదైన ముద్రేసిన భామలెవరున్నారో ఓ సారి చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. India vs England: ఇదీ మన బౌలర్ల విజృంభణ

ఆంగ్లేయుల గడ్డపై టీమ్‌ఇండియా దుమ్మురేపుతోంది. నాలుగో టెస్టులో అద్వితీయ విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీసులో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాదాపుగా 50 ఏళ్ల తర్వాత ఓవల్‌ మైదానంలో గెలుపు బావుటా ఎగరేసింది. ఆశల్లేని స్థితిలోంచి పుంజుకొని అద్భుతంగా మ్యాచును ముగించింది. ఈ మ్యాచులో టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌ చేసి 191 పరుగులే చేసింది. ఇంగ్లాండ్‌ 290తో బదులివ్వడంతో రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన భారీ స్కోరు చేయాల్సి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Cricketers: ఆటే కాదు.. ఫేమూ సూపరహే!

7. Corona: కొత్త కేసులు 31,222.. రికవరీలు 42,942

దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గడం ఊరటనిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 31వేల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవగా.. మరణాలు 300 దిగువకు తగ్గాయి. ఇక వరుసగా రెండో రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15 లక్షలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,222 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.30కోట్లు దాటింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Vemulawada: వేములవాడలో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్టాండ్‌ నుంచి ఆలయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. మూలవాగుపై కొత్తగా బ్రిడ్జి నిర్మాణం కోసం సెంట్రింగ్‌ పనులు జరుగుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జి నిర్మాణం కోసం చేపట్టిన సెంట్రింగ్‌ కుప్పకూలింది. దాదాపు ఐదేళ్ల క్రితం రూ.28 కోట్లతో వంతెన నిర్మాణం మొదలుపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

KCR Review: భారీ వర్షాలపై దిల్లీ నుంచి సీఎం కేసీఆర్‌ సమీక్ష

9. SBI Debit Card-EMI: ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు చెల్లింపుని ఇలా ఈఎంఐగా మార్చుకోండి!

ఇప్పటి వరకు కేవలం క్రెడిట్‌ కార్డు బిల్లులను మాత్రమే ఈఎంఐ కిందకు మార్చుకునే అవకాశం ఉండేది. అయితే, ఇప్పుడు చాలా బ్యాంకులు డెబిట్‌ కార్డు ద్వారా చేసే చెల్లింపులను కూడా ఈఎంఐగా మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ కూడా తన ఖాతాదారులకు ఈ సదుపాయం కల్పిస్తోంది. స్టోర్లలోనే కాకుండా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో చేసే కొనుగోళ్లను కూడా డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసి.. ఆ మొత్తాన్ని ఈఎంఐ కిందికి మార్చుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నందు

 తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈడీ అధికారులు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని సుదీర్ఘంగా విచారించారు. నటుడు నందు మంగళవారం ఈ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో నందుకి సంబంధించిన  అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని