Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 14/09/2021 21:45 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Sai Dharam Tej: సాయి తేజ్ ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు చేయొద్దు : తలసాని

ఆ వినాయకుడి దయ వల్ల సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌.. రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అపోలో ఆస్పత్రిలో సాయి తేజ్‌ను పరామర్శించిన అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. సాయి తేజ్‌కి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని చెప్పారు. హెల్మెట్‌, షూస్‌, జాకెట్‌ ధరించడవం వల్ల ప్రమాదం తప్పిందని వివరించారు. సాయి తేజ్‌కు స్వల్ప ఫ్రాక్చర్‌ అయినట్లు ఎంఆర్‌ఐ స్కాన్‌లో తేలిందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

2. IND vs ENG: 26/11 దాడులప్పుడు ఇంగ్లాండ్‌ ఏం చేసిందో మర్చిపోవద్దు: గావస్కర్

ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దయిన నేపథ్యంలో భవిష్యత్‌లో మ్యాచ్‌ తిరిగి నిర్వహించేందుకు ప్రయత్నిస్తోన్న బీసీసీఐని దిగ్గజ బ్యాట్స్‌మెన్‌, మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ కొనియాడాడు. భారత క్రికెట్‌ బోర్డు సరైన పని చేస్తోందని మెచ్చుకున్నాడు. 2008లో ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు 26/11 దాడులు జరిగాయని, అప్పుడా జట్టు చేసిన మేలును మర్చిపోవద్దని గుర్తుచేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Crime news: సైదాబాద్‌ బాలిక హత్య ఘటన... పోలీసుల అదుపులో నిందితుడు రాజు

నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో కలకలం రేపిన బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో అరెస్టు చేశారు. రాజు స్వగ్రామం అడ్డగూడురులో అతడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ వెల్లడించారు. సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 9/11 attacks : ఆ రక్తపు మరకలకు రెండు దశాబ్దాలు!

కళ్ల ముందే వందల అంతస్తుల భవంతులు కుప్పకూలిపోయాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అగ్రరాజ్య ఆధిపత్యంపై పోరాటమంటూ ఉగ్రవాదులు చేపట్టిన ఆ మారణహోమం.. కొన్ని వేలమంది అమాయకుల్ని పొట్టన పెట్టుకుంది. రక్షణ వ్యవస్థ పరంగా బలమైన దేశంగా భావించే అమెరికాలో అల్ ఖైదా ముష్కరుల నరమేధం జరిగి.. 2 దశాబ్దాలు పూర్తి కాగా.. ఆ రక్తపు మరకలు చెరిపేసేందుకు అగ్రరాజ్యం 20 ఏళ్ల పాటు చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Mydukur: పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ కుటుంబం ఆవేదన.. వీడియో వైరల్‌

కడప జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. కడప జిల్లా దువ్వూరు మండలంలోని తమ 1.5 ఎకరాల భూమిని ఆక్రమించిన స్థానిక వైకాపా నాయకుడు తిరుపాల్‌రెడ్డి.. మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డితో కలిసి బెదిరిస్తున్నారని కుటుంబం విలపించింది. వారికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Chandrababu: పోలీసులే దౌర్జన్యానికి దిగితే సామాన్యులకు దిక్కెవరు?: చంద్రబాబు

6. Delhi Rains: దిల్లీ ముంచెత్తిన వాన.. ఎయిర్‌పోర్టులోకి వరదనీరు

దేశ రాజధాని దిల్లీ వాసులను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున మరోసారి కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వరదనీరు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. France: ఫ్రాన్స్‌లో ఒకప్పుడు రోజుకు 10 గంటలే!

 రోజుకు 24 గంటలు.. గంటకు 60 నిమిషాలు.. నిమిషానికి 60 సెకన్లు.. ఇది గడియారంలో సమయం లెక్క. ఎప్పటి నుంచో మనం దీన్నే పాటిస్తున్నాం. కానీ గతంలో ఫ్రాన్స్‌కు ఈ స్టాండర్డ్‌  టైం నచ్చలేదు. దీంతో దశాంశం(డెసిమల్‌) పద్ధతిలో రోజుకు 10 గంటలే ఉండేలా గడియారాన్ని మార్చేశారు. అయితే, ప్రజలు ఈ గడియారాన్ని అనుసరించి పనులు చేసుకోవడానికి విముఖత చూపారు. దీంతో మళ్లీ పాత పద్ధతిలో 24 గంటల గడియారాన్నే తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Corona: దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు, మరణాలు ఎన్నంటే...

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే రెండు రోజులుగా కొత్త కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.92లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 33,376 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అటు కొవిడ్‌ విజృంభణ ఎక్కువగా ఉన్న కేరళలోనూ కేసులు కాస్త తగ్గాయి. నిన్న ఆ రాష్ట్రంలో 25వేల కొత్త కేసులు వెలుగుచూశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. UN-Taliban: తాలిబన్ల విజయం.. వారికి ధైర్యం?

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు సాధించిన విజయంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీరి విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర తీవ్రవాద సంస్థలకు ధైర్యాన్నిచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే తాలిబన్లతో చర్చలు జరపాల్సిన అవసరమూ ఉందన్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గాన్‌ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Sai Dharam Tej: నిర్లక్ష్యపు, ర్యాష్‌ డ్రైవింగ్‌ కింద సాయితేజ్‌పై కేసు

రోడ్డు ప్రమాదానికి గురైన సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యపు, ర్యాష్‌ డ్రైవింగ్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి 8.05 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీసీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. సాయితేజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ని స్వాధీనం చేసుకుని.. రాయదుర్గం పోలీసుస్టేషన్‌కు తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Sai Dharam Tej: కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై కూడా కేసు పెట్టాలి: ఆర్పీ పట్నాయక్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని