Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 14/09/2021 13:20 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Raghurama: సీబీఐ కోర్టు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపండి: హైకోర్టులో రఘురామ పిటిషన్‌

అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇటీవల వాదనలు పూర్తయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Taliban : తాలిబన్‌కు ఐరన్‌ బ్రదర్స్‌ అండ దండలు..!

అమెరికా సైనికులు స్వదేశానికి చేరారు. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అఫ్గాన్‌ యుద్ధంలో గత 20 ఏళ్లలో పాక్‌పాత్రపై అమెరికా అధ్యయనం చేస్తుందట..! తాజాగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిలో తాలిబన్లకు పాక్‌ ఆశ్రయమిచ్చిన అంశాన్ని కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో పాక్‌ పోషించాల్సిన పాత్ర, ఆ దేశంతో సంబంధాలపై పునర్‌ విశ్లేషించుకొంటామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. AP EAPCET: అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలు విడుదల

 ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్-2021) ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఇంజినీరింగ్‌ ఫలితాలను వెల్లడించగా.. తాజాగా అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలను వెల్లడించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Team India: రవిశాస్త్రిపై చర్యలు ఉంటాయా? గంగూలీ ఏం చెప్పాడంటే..!

టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా శాస్త్రి ఓవల్‌లోని హోటల్లో  బసచేస్తుండగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, పుస్తకావిష్కరణకు సంబంధించి బీసీసీఐ నుంచి అనుమతి పొందలేదని.. అయినా రవిశాస్త్రిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని గంగూలీ ఓ అంతర్జాతీయ పత్రికతో అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* IPL 2021: నాలాంటి ముసలోడు నిత్యనూతనంగా ఉండాలి: డివిలియర్స్

5. REX MK II: సరిహద్దుల రక్షణకు సరికొత్త చిట్టి

యుద్ధ క్షేత్రాల్లో గస్తీ తిరుగుతూ చొరబాటుదారులను గుర్తించి కాల్పులు జరిపే సామర్థ్యమున్న సరికొత్త సాయుధ రోబోను ఇజ్రాయెల్‌ ఆవిష్కరించింది. దీనిని రిమోట్‌ కంట్రోల్‌ సహాయంతో నియంత్రించవచ్చు. నాలుగు చక్రాలతో కూడిన ఈ మానవ రహిత వాహనాన్ని ‘రెక్స్‌ ఎంకే2’ పేరుతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వ సంస్థైన ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Jio Laptop: మరోసారి వార్తల్లో జియో ల్యాప్‌టాప్‌.. ఈసారి ఫొటోతో 

తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్స్‌తో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు గూగుల్‌తో కలిసి జియో స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం జరిగిన రిలయన్స్‌ ఏజీఎం సమావేశంలో కంపెనీ ప్రకటించింది. అయితే ఈ కొత్త ఫోన్‌ను వినాయకచవితికి విడుదల చేస్తారని తొలుత భావించినప్పటికీ దీపావళికి తీసుకొస్తున్నట్లు జియో తెలిపింది. అలానే రిలయన్స్ ఏజీఎం సమావేశంలోనే జియో ల్యాప్‌టాప్‌పై ప్రకటన చేస్తారని ఆశించినప్పటికీ దానికి సంబంధించి కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. AP Politics: ఫైబర్‌ నెట్‌పై 121 పైసల అవినీతినీ నిరూపించలేరు: పట్టాభి సవాల్‌

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై అవినీతి బురద చల్లే కార్యక్రమానికి జగన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. సీఐడీని గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్నారని ఆయన విమర్శించారు. తెదేపా పాలనలో రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని బురద చల్లిన జగన్‌ రెడ్డి.. ఏ ఒక్కటీ రుజువు కాకపోవటం వల్ల అసహనంతో ఫైబర్ నెట్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. kareena: పారితోషికం కాదు.. మహిళల గౌరవాన్ని పెంచాను

కథానాయికలకు హీరోలతో సమానంగా పారితోషికం దక్కడం లేదంటూ చాలా సందర్భాల్లో పలువురు నాయికలు బాహాటంగానే విమర్శలు చేశారు. తాజాగా కరీనా కపూర్‌ కూడా ఈ విషయంపై స్పందించింది. ‘రామాయణ’ పేరుతో తెరకెక్కనున్న ఓ పౌరాణిక కథలో సీత పాత్రలో కరీనా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని సీత పాత్ర కోసం ఆమె తన పారితోషికాన్ని రూ.12 కోట్లకు పెంచిందని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

bigg boss telugu5: రెండోవారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీరే!

9. India Corona: 25 వేలకు దిగొచ్చిన కేసులు.. 75 కోట్లు దాటిన టీకా డోసులు

దేశంలో వరుసగా మూడో రోజు 30 వేల దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం 300 దాటాయి. ఇక కేరళ, మహారాష్ట్రలో కూడా పరిస్థితులు అదుపులో ఉన్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. కేరళలో నిన్న 15,058 కొత్త కేసులు.. 99 మరణాలు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 14,30,891 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..25,404 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ICC Dog of the Month: ‘డాగ్‌ ఆఫ్‌ ది మంత్‌’గా శునకానికి ఐసీసీ అవార్డు

ప్రతి నెలా క్రికెటర్లకు అవార్డులను ఇచ్చే ఐసీసీ ఈసారి ఓ ప్రత్యేక పురస్కారం ప్రకటించింది. ఆ అవార్డు దక్కింది క్రికెటర్‌కు కాదు ఓ శునకానికి కావడం గమనార్హం! ఐర్లాండ్‌లో తాజాగా ఒక టీ20 మ్యాచ్‌ జరుగుతుండగా మధ్యలోకి ఓ శునకం దూసుకొచ్చి.. బంతిని నోట కరుచుకుని మైదానంలో పరుగులు పెట్టింది. చివరికి అది బంతిని తీసుకెళ్లి బ్యాటర్‌కు ఇచ్చేసింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఐసీసీ దాన్ని చూసి.. ఇప్పుడా శునకానికి ప్రత్యేక అవార్డు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని