Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 15/10/2021 13:26 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. AP News: జలవిద్యుత్‌ కేంద్రాలు కేఆర్‌ఎంబీకి అప్పగింత.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

ఏపీ పరిధిలోని జల విద్యుత్‌ కేంద్రాలను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీశైలం కుడిగట్టున ఉన్న పవర్‌ హౌస్‌ను, సాగర్‌ కుడి కాల్వపై ఉన్న విద్యుత్‌ కేంద్రాన్ని అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ అప్పగించాకే తమ పవర్‌ హౌస్‌లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని షరతు విధించిన ఏపీ సర్కార్‌.. పవర్‌ ప్రాజెక్టుల్లోని భవనాలు, కట్టడాలు, యంత్ర సామాగ్రిని కేఆర్‌ఎంబీకి అప్పగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. IND vs PAK: భారత్‌ x పాక్‌ మ్యాచ్‌ నేపథ్యంలో అద్భుత యాడ్‌ చూశారా?

క్రికెట్‌ ప్రేమికులకు పసందైన వినోదం అందించిన ఐపీఎల్‌ సందడి ఈరోజుతో ముగియనుంది. ఇక 2021 టీ20 ప్రపంచకప్‌ ఈ నెల 17 నుంచి మొదలుకాబోతోంది. యూఏఈ, ఒమన్‌ వేదికలుగా ఈ మెగా ఈవెంట్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అయితే, ఈనెల 24న భారత్‌xపాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసమే ప్రపంచంలోని క్రికెట్‌ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిసారి 2019 వన్డే ప్రపంచకప్‌లో పోటీ పడిన ఈ రెండు జట్లు మళ్లీ ఇన్నాళ్లకు బరిలోకి దిగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Shafali Verma: బిగ్‌బాష్‌ లీగ్‌లో లేడీ జడేజా.. షెఫాలీ వర్మ డైరెక్ట్‌ త్రో

3. Sai Dharam Tej: ఆస్పత్రి నుంచి సాయిధరమ్‌ తేజ్‌ డిశ్చార్జ్‌.. చిరు ట్వీట్‌
సినీ ప్రియులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మేనల్లుడు  సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్టు చిరు వెల్లడించారు. శుక్రవారం సాయితేజ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా ఆయన విషెస్‌ చెప్పారు. ‘విజయదశమి మాత్రమే కాకుండా మా ఇంట్లో ఈరోజు మరో ప్రత్యేకమైన విశేషం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Petrol Diesel Prices: పండగరోజూ వదల్లేదు.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు!

పండుగ రోజూ సామాన్యుడిపై పెట్రో బాదుడు ఆగలేదు.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఇప్పటికే నూనెలు, వంటగ్యాస్‌ సహా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చమురు ధరల పెంపు నుంచి కనీసం పండగరోజైనా ఉపశమనం లభిస్తుందని ఆశించిన సామాన్యులకు నిరాశే మిగిలింది. గత మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 17 సార్లు పెరగ్గా.. పెట్రోల్‌ ధరలు 14 సార్లు ఎగబాకాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. India Corona Update: కరోనా కేసులు తగ్గాయ్‌.. కానీ!
దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ముందురోజు 19 వేలకు చేరువైన కొత్త కేసులు.. తాజాగా 16 వేలకు పడిపోయాయి. రోజువారీ కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. అయితే మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. తాజాగా దేశవ్యాప్తంగా 11,80,148 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,862 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Bheemla Nayak: భీమ్లా నాయక్‌ దసరా సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

పవర్‌స్టార్‌ అభిమానులకు దసరా స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నుంచి రెండో పాట విడుదలైంది. మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ‘భీమ్లానాయక్‌’ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. పవన్‌కల్యాణ్- రానా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా, దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఈ సినిమా నుంచి ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఓ పాటను చిత్రబృందం సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

RC 16: రామ్‌చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్‌.. అధికారిక ప్రకటన వచ్చేసింది..!

7. JEE Advanced 2021 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేశాయ్‌..

దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరగ్గా.. ఆ ఫలితాలను ఖరగ్‌పూర్‌ ఐఐటీ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 50వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను 20వేల మంది విద్యార్థులు రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Bill Clinton: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌కు తీవ్ర అస్వస్థత..!

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ (75) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను దక్షిణ కాలిఫోర్నియా ఆస్పత్రిలో చేర్పించారు. కొవిడ్‌కు సంబంధం లేని ఇతర ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం క్లింటన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో పాటు నర్సులు, ఆస్పత్రి సిబ్బంది క్లింటన్‌కు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Aryan Khan: ఆర్యన్‌ తరచూ డ్రగ్స్‌ వాడుతుంటారు: ఎన్సీబీ

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకుంటుంటారని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) తెలిపింది. బెయిలు కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును వ్యతిరేకించింది. దీంతో బెయిలు పిటిషన్‌పై తీర్పును కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆర్యన్‌ జైల్లోనే ఉండనున్నారు. డ్రగ్స్‌ కేసులో అరెస్టైన ఆర్యన్‌ బెయిలు కోసం చేసుకున్న దరఖాస్తుపై ప్రత్యేక కోర్టులో ఎన్‌సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) అనిల్‌ సింగ్‌ గురువారం వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Maoist Leader RK: ఆర్కే మృతిని ధ్రువీకరించిన మావోయిస్టు పార్టీ

మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మృతిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ధ్రువీకరించింది. ఆయన మృతి చెందినట్టు పార్టీ కేంద్ర కమిటీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్‌ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. నిన్న ఉదయం 6గంటలకు ఆర్కే కన్నుమూసినట్టు ప్రకటనలో వెల్లడించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆర్కే.. డయాలసిస్‌ జరుగుతుండగా మృతిచెందారని పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

LinkedIn: చైనాలో నిలిచిపోనున్న లింక్డిన్‌ సేవలు.. ఎందుకంటే?


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని