Top Ten News @ 9AM

తాజా వార్తలు

Updated : 28/05/2021 09:34 IST

Top Ten News @ 9AM

1. Lockdownపై ప్రజలు ఏమనుకుంటున్నారు?

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా తీశారు. ఈ నెల 30న మంత్రిమండలి సమావేశాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు సీఎం స్వయంగా ఫోన్‌ చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మీ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? లాక్‌డౌన్‌ ఎలాంటి ప్రభావం చూపింది? వివిధ వర్గాల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఆంక్షలు, సడలింపులను ఎలా చూస్తున్నారు? పోలీసుల పనితీరు ఎలా ఉంది? తదితర వివరాలను సీఎం అడిగారని తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Corona: వారంలో తగ్గుతుంది

కొవిడ్‌ రోగులకు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీల’ రూపంలో ఆధునిక వైద్యం బాధితులకు భరోసానిస్తోంది. మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని వెల్లడవడంతో.. భారత ప్రభుత్వం తాజాగా ఈ చికిత్సకు అనుమతించింది. 2 లక్షల డోసులను దిగుమతి చేసుకోవడానికి ఒక ప్రైవేటు ఔషధ సంస్థకు పచ్చజెండా ఊపింది. దీంతో ఎక్కడో అమెరికాలో అనుసరిస్తున్న చికిత్స ఇప్పుడు మన దేశంలోనే కాదు.. మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* corona vaccine: టీకాలు ముందే కొనాల్సింది

3. TS News: జులై 15 తర్వాత ఇంటర్‌ పరీక్షలు!

రాష్ట్రంలో జులై 15వతేదీ తర్వాత ఇంటర్‌ వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు తెలిపింది. పరీక్షల నిర్వహణపై లిఖితపూర్వకంగా అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం కోరిన నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. జులై మధ్యలో పరీక్షలు మొదలుపెడతామని, ఆగస్టు చివరి నాటికి ఫలితాలు వెల్లడిస్తామని అందులో పేర్కొన్నారు. లేఖలో ఇంకా ఏమేం చెప్పారంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మాకు పాఠాలు చెప్పకండి!

కొత్త ఐటీ డిజిటల్‌ నియమ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వానికి... ‘సోషల్‌ మీడియా’ దిగ్గజ సంస్థలకు మధ్య యుద్ధం ముదురుతోంది. బుధవారం వాట్సప్‌ సంస్థ ధిక్కార స్వరం వినిపించగా... గురువారం అమెరికా కేంద్రంగా పనిచేసే మరో ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ తొలిసారిగా స్పందించింది. దిల్లీ పోలీసులు తమను భయపెడుతున్నారంటూ... భారత్‌లో ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు ముప్పు ఏర్పడుతోందంటూ ట్విటర్‌ ఆరోపించింది! దీనికి వెంటనే దిల్లీ పోలీసు విభాగంతో పాటు...కేంద్ర ప్రభుత్వం కూడా దీటుగా స్పందించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Raghurama: ‘గాయాలున్నాయని ఆర్మీ ఆసుపత్రి చెప్పలేదు

ఎంపీ రఘురామకృష్ణరాజు పాదాలపై ఎడిమా ఉందనే సైనిక ఆసుపత్రి పేర్కొంది తప్ప, ఆయనకు గాయాలు ఉన్నాయని కానీ, అవి పోలీసు కస్టడీలోనే అయ్యాయని కానీ ఎక్కడా చెప్పలేదని ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం తెలిపింది. సుప్రీంకోర్టుకు సైనిక ఆసుపత్రి అందించిన నివేదికలోనూ ఇదే విషయం ఉందని వివరించింది. ఈ మేరకు సీఐడీ ప్రధాన కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సైనిక ఆసుపత్రి నివేదిక కంటే ముందే మూడు సార్లు వైద్యులు పరిశీలించి నివేదికలు ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆనందయ్య మందుపై త్వరగా నిర్ణయం తీసుకోండి

 కొవిడ్‌కు ఆనందయ్య ఇచ్చిన మందు పంపిణీ విషయంలో అత్యంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. మందుపై పరీక్షల నిర్వహణ పేరుతో ఆలస్యం చేయడం తగదని పేర్కొంది. ఈనెల 29న ఆయుష్‌శాఖ నుంచి ఆనందయ్య మందుపై నివేదిక వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్‌ చెబుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నిమిషాల్లోనే ఆర్‌టీ-పీసీఆర్‌ ఫలితం

7. సంపద సృష్టికి.. అడ్డంకులివే...

ఆర్థికంగా అత్యున్నత జీవితం గడపాలని అందరూ కోరుకుంటారు. సంపాదించిన మొత్తం ఖర్చు చేస్తూనే ఉంటే.. ఈ కోరిక ఎప్పటికీ తీరదు. సంపదను సృష్టించాలంటే.. క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం ఒక్కటే మార్గం. అయితే, మదుపు చేసే దిశలో మనం వెళ్తున్నప్పటికీ కొన్ని విషయాలు మనకు అడ్డు వస్తూ ఉంటాయి. అవేమిటి.. వాటిని ఎలా అధిగమించాలి అనేది తెలుసుకున్నప్పుడే.. ఆర్థిక విజయం సాధ్యం అవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిగూఢ కరెన్సీలు భద్రమేనా?

కొన్నేళ్ల నుంచి మదుపరులను మురిపిస్తున్న బిట్‌ కాయిన్‌ తదితర క్రిప్టో (నిగూఢ) కరెన్సీల భవిష్యత్తుపై నేడు అనిశ్చితి అలముకొంది. ప్రపంచమంతటా చలామణీలో ఉన్న 5000 క్రిప్టో కరెన్సీలలో బిట్‌ కాయిన్‌, ఎథీరియంలే అగ్రగణ్యమైనవి. గత వారంరోజుల్లోనే క్రిప్టో మార్కెట్‌కు లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. క్రిప్టోలకు కరెన్సీ ప్రతిపత్తిని నిరాకరించి, సొంత డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలని ప్రధాన దేశాలు భావిస్తుండటం దీనికి మొదటి కారణం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పీఎంజేజేబీవై కొవిడ్‌ మరణాలకు వర్తిస్తుందా?

ఇప్పుడు చాలామందికి పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై పథకాల గురించి ఉన్న సందేహాలివి.. దేశ వ్యాప్తంగా ప్రజలకు తక్కువ ఖర్చుతో బీమా సౌకర్యం కల్పించేందుకు తీసుకొచ్చిన పథకాలే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై). ఈ పాలసీలను తీసుకున్న వ్యక్తులు మరణిస్తే.. బీమా పరిహారం నామినీకి అందుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆరోగ్య బీమా.. ఎలా ఉండాలంటే..

10. ఆ ఒక్కటి అందేనా..!

తిరుగులేని ఆధిపత్యంతో ప్రపంచ టెన్నిస్‌పై చెరగని ముద్ర వేసింది సెరెనా విలియమ్స్‌.  తన ఆటతో, పోరాట పటిమతో ఎంతో కీర్తిని మూటగట్టుకున్న ఈ దిగ్గజం... ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. కానీ ఆ ఒక్కటి ఆమెను ఊరిస్తోంది. అందకుండా అసహనానికి గురి చేస్తోంది. అదే 24 వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే! కెరీర్‌ ముగింపునకు దగ్గర్లో ఉన్న ఆమె ఆ ఒక్కటి అందుకోగలదా? అని. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని