Top Ten News @ 5 PM

తాజా వార్తలు

Published : 18/07/2021 16:56 IST

Top Ten News @ 5 PM

1. తెలుగుభాషను భావితరాలకు అందించాలి: సీజేఐ

జ్ఞాపక శక్తి, అపార మేధస్సు, భాష మీద పట్టు మేళవింపే అష్టావధానం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తిరుపతి నుంచి ఆన్‌లైన్‌లో జరిగిన చతుర్గుణిత అష్టావధానంలో జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అవధాని మేడసాని మోహన్‌ ఆధ్వర్యంలో చతుర్గుణిత అష్టావధానం నిర్వహించారు. తొలి ప్రశ్న వేసి అష్టావధానాన్ని సీజేఐ ప్రారంభించారు. 

2. తెలుగు రాష్ట్రాల్లో మరో 3రోజులు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో  ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈనెల 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

3. 2018లోనే ఓడించేందుకు కుట్ర: ఈటల

ఉప ఎన్నికలు వస్తేనే  ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తోందని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో ఈటల మాట్లాడారు. ఉప ఎన్నిక రాగానే కుల సంఘాల భవనాలు మంజూరయ్యాయని గుర్తు చేశారు. తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు కుట్ర చేశారని తెలిపారు.

పోటీలో తానున్నా.. రాజేందర్‌ ఉన్నా ఒక్కటే: ఈటల సతీమణి

4. Raghurama: జీతాలివ్వలేని స్థితికి వచ్చారు

నీటి వివాదం లాగే మూడు రాజధానుల అంశాన్నీ కేంద్రమే పరిష్కరించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రఘురామ లేఖ రాశారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టానికి అసెంబ్లీలో సవరణ కుదరదని.. మూడు రాజధానులపై పార్లమెంట్‌లోనే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. 

ముందే మేల్కొంటే ఇలా అయ్యేది కాదు: దేవినేని

5. Priyanka: ఎన్నికల్లో పోటీ చేయడమా.. చూద్దాం

ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసే విషయం ‘చూద్దాం’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చిన ఆమె శనివారం ఈ విషయమై లఖింపుర్‌ ఖేరిలో విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. యూపీలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగుతారా, పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా అని ఆమెను ప్రశ్నించగా ‘అన్నీ నేను ఇప్పుడే చెప్పాలా?’ అని బదులిచ్చారు.

6. Parliament: వర్షాకాల సమావేశాలకు పార్టీలు సన్నద్ధం!

సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు అఖిలపక్షం భేటీ అయ్యింది. పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని అధికారపక్షం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. 

7. UK: రెండు డోసులు తీసుకున్న ఆరోగ్యమంత్రికి కరోనా!

బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్న ఆయన.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారిని కొవిడ్ టెస్టు చేయించుకోవాలని సాజిద్‌ సూచించారు. దీంతో బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌, ఆర్థిక మంత్రి రిషి సునక్‌లు ఐసోలేషన్‌లో ఉంటునట్లు బ్రిటన్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

8. Smartwatches: ₹ 5వేల ధరలో..స్మార్ట్‌ అండ్ స్టైలిష్‌
స్మార్ట్‌వాచ్.. సంప్రదాయ వాచ్‌ల స్థానంలో వీటిని ఉపయోగించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న మోడల్స్‌వైపు యూజర్స్ మొగ్గు చూపుతున్నారు. తాజాగా నాయిస్‌ కంపెనీ కొత్త మోడల్ స్మార్ట్‌వాచ్‌ను తీసుకొస్తూ ఏడు రోజుల బ్యాటరీ బ్యాక్‌అప్ ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో రూ. 5వేల ధరలో వారం రోజుల బ్యాటరీ లైఫ్‌తో మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌వాచ్‌ల జాబితాను పరిశీలిద్దాం. 

9. ఉక్కు రంగంపై రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఆసక్తి
ప్రభుత్వ రంగ స్టీలు కంపెనీ సెయిల్‌ (స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) షేర్లను స్టాక్‌మార్కెట్లో అగ్రశ్రేణి ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా భారీగా కొనుగోలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌లో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా 5.75 కోట్ల సెయిల్‌ షేర్లు కొనుగోలు చేశారు. ఈ షేర్లు సెయిల్‌ జారీ మూలధనంలో 1.39 శాతానికి సమానం.

Share Market: షేరు..షేరు..మాకెందుకు రాలేదు

10. India vs Srilanka: కిషన్‌, సూర్య అరంగేట్రం

భారత్‌, శ్రీలంక సరీసులో టాస్‌ గెలిచిన లంక సారథి దసున్‌ శనక మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ప్రేమదాస స్టేడియం చరిత్రను అనుసరించి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నామని శనక తెలిపాడు. భారత్‌లో ఇద్దరు కుర్రాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. యువ కెరటం ఇషాన్‌ కిషన్‌, 360 డిగ్రీ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్నారు. నేడు కిషన్‌ పుట్టినరోజు కావడం గమనార్హం. 

India vs Srilanka లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని